Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుమారుడికి కాబోయే భార్యను ప్రేమించి పెళ్లాడాడు ! చివరకు..

కుమారుడికి కాబోయే భార్యను ప్రేమించి పెళ్లాడాడు ! చివరకు..

Phani CH

|

Updated on: Jan 21, 2025 | 3:16 PM

అదేంటి.. లేటు వయసులో ప్రేమించకూడదా? ఎందుకు కూడదు.. ఎదుటి వ్యక్తికి ఇబ్బంది లేనప్పుడు ఎంచక్కా ప్రేమించుకోవచ్చు. సమాజం ఏమనుకుంటే నాకెందుకు అనే ధోరణిలో ఉన్నప్పుడు ముందువెనక చూడకుండా లవ్వాడొచ్చు. ఇప్పుడు ఓ పెద్ద మనిషి ఓ అమ్మాయిపై మనసుపడ్డాడు. మరో ముందుడుగేసి ఏకంగా పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇందులో అబ్జెక్షన్ ఏముంది అనుకోవచ్చు.

కానీ ఈ స్టోరీలో ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కుమారుడికి కాబోయే భార్యను ప్రేమించి పెళ్లాడాడో వ్యక్తి. మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిందీ ఘటన. ఓ వ్యక్తి తన కుమారుడికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఓ అమ్మాయిని చూశాడు. కుమారుడికి కూడా ఆ అమ్మాయి నచ్చడంతో పెళ్లి కుదిరింది. ముహూర్తాలు కూడా నిశ్చయించుకున్నారు. ఇరు కుటుంబాల ఇళ్లలోనూ పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇక్కడే ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. వన్ ఫైన్ డే.. పెళ్లి కొడుకు తండ్రి, వధువు ఇద్దరూ సైలెంట్‌గా ఓ గుళ్లో పెళ్లి చేసుకుని ఎంచక్కా ఇంటికొచ్చారు. తనకు కాబోయే భార్యతో పెళ్లి దుస్తుల్లో వచ్చిన తండ్రిని చూసి పెళ్లికొడుకు షాకయ్యాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీళ్లే నిప్పంటిస్తారు..వీళ్లే ఆర్పుతారు.. ఇదేం పైత్యమో..!