Akhil Akkineni: అయ్యవారి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ ?
పెద్దోడి పెళ్లి ఘనంగా జరిగింది. ఇక చిన్నోడి పెళ్లే తరువాయి. అది కూడా గ్రాండ్‌గా చేస్తే.. తండ్రిగా కింగ్ నాగార్జున బాధ్యత తీరిపోతుంది. అయితే ఆ బాధ్యత కూడా తొందర్లోనే తీరేలా కనిపిస్తోంది. ఎందుకంటే కింగ్ చిన్నబ్బాయి.. అయ్యవారి పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయిందనే న్యూస్ .. ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది కనుక. ఎస్ ! అక్కినేని అఖిల్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిందట.
చడీచప్పుడు కాకుండా.. తన చిన కొడుకు ప్రేమించిన జైనాబ్‌తో ఇటీవలే ఎంగేజ్ మెంట్ చేశారు నాగార్జున. ఇప్పుడు వీరి పెళ్లికి ఓ మాంచి మూహూర్తాన్నికూడా ఫిక్స్ చేశారట. కృష్ణ పక్ష దశమి రోజున… ఉత్తర ఆషాఢ నక్షత్రంలో సోమవారం మార్చి 24 న వీరిద్దరి పెళ్లి చేసేందుకు రెడీ అవుతున్నారట. సేమ్ అన్నకు చేసినట్టే.. అన్నపూర్ణ స్టూడియోలోనే.. తన తండ్రి నాగేశ్వరరావు విగ్రహం ముందే.. అతి కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో.. అఖిల్- జైనాబ్ పెళ్లిని గ్రాండ్గా.. శాస్త్రోక్తంగా చేయనున్నారట కింగ్. అయితే ఇదేమీ నాగార్జున నుంచి కానీ.. నాగార్జున టీం నుంచి కానీ వచ్చిన అఫీషియల్ న్యూస్ కానప్పటికీ.. ఫిల్మ్ నగర్లో మాత్రం.. ఈ న్యూసే చక్కర్లు కొడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షూటింగ్ పేరుతో అడవిలో మంటలు.. హీరోకు వార్నింగ్ ఇచ్చిన గ్రామస్థులు
ఈ ఆకులను చీప్‌గా చూడకండి.. నాలుగు ఆకులు తిన్నారంటే రోగాలన్నీ పరార్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

