Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: అదివారం ఎట్టి పరిస్థితుల్లో ఆ పని మాత్రం చేయను..

Balakrishna: అదివారం ఎట్టి పరిస్థితుల్లో ఆ పని మాత్రం చేయను..

Phani CH

|

Updated on: Jan 21, 2025 | 5:55 PM

'డాకు మహారాజ్' భారీ విజయం సాధించడంతో బాలకృష్ణ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే సుమారు రూ.130 కోట్లు సాధించింది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ సినిమాను నాగవంశీ నిర్మించారు. సినిమా సక్సెస్‌లో భాగంగా మూవీ టీమ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

అయితే, బాలయ్యకు సండేతో ఉన్న ఒక సెంటిమెంట్‌ గురించి పంచుకున్నారు. నిజ జీవితంలో ఒక సెంటిమెంట్‌ అనుసరిస్తానని బాలకృష్ణ ఇలా అన్నారు. ఆదివారం రోజు తాను నలుపు రంగు దుస్తులు అసలు ధరించననీ ఆదివారం అంటే తనకు బ్లాక్ డేంజర్ అనీ అన్నారు. ఒకవేళ అలా వేసుకుంటే తనకు చాలా ప్రమాదమనీ తనది మూలా నక్షత్రం కావడంతో ఆదివారం నలుపు మంచిది కాదని కొందరు చెప్పడంతో దానిని పాటిస్తున్నాననీ చెప్పారు. ప్రత్యాది దేవతలు ఉంటారనేది నమ్ముతాననీ అందుకే ఆదివారం నలుపు ధరించనన్నారు. అయితే, ఓసారి ఆదిత్య 369 షూటింగ్ సమయంలో ఆదివారం బ్లాక్ డ్రెస్ ధరించాల్సి వచ్చిందని తెలిపారు. ఆ డ్రెస్‌ వద్దని ముందే చెప్పా కానీ, దర్శకులు చెప్పారు కాబట్టి తప్పలేదనన్నారు. కానీ, ఏదో నష్టం జరగబోతుందని ముందే గ్రహించాననీ అన్నారు. అదేరోజు రాక రాక బాలసుబ్రమణ్యం కూడా షూటింగ్‌ సెట్స్‌లోకి వచ్చారట. ఆయన కళ్ల ముందే కిందపడిపోవడంతో తన నడుము విరిగిందన్నారు. అయితే, ఆయన రావడం వల్లే ఇలా జరిగిందనుకొని ఆ తర్వాత బాలసుబ్రమణ్యం మళ్లీ షూటింగ్ ప్రాంతంలోకి రాలేదట. ఆయన కూడా చాలా కంగారుపడ్డారంటూ ఆదివారంతో తనకు ఉన్న సెంటిమెంట్‌ను బాలయ్య పంచుకున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార కేసులో నిందితుడికి జీవితఖైదు

TOP 9 ET News: వెంకీతో రూ. 50 కోట్లే కష్టం అన్నారు కానీ కట్ చేస్తే…| బుల్లి రాజుకు కష్టాలు

రోగం కాదు.. ఓవర్ యాక్షన్.. పబ్లిసిటీ కోసమే కదా.. ఈ కథలు!

Akhil Akkineni: అయ్యవారి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ ?

షూటింగ్‌ పేరుతో అడవిలో మంటలు.. హీరోకు వార్నింగ్ ఇచ్చిన గ్రామస్థులు

Published on: Jan 21, 2025 05:52 PM