సింధు నదిలో టన్నుల కొద్దీ బంగారం.. పాక్ దశ తిరగనుందా ??
సింధూ నది లోయలో భారీగా బంగారం నిల్వలను గుర్తించారు. దాదాపు 32.6 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని, వాటి విలువ దాదాపు రూ.18వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలో ఉన్న పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలో ఉన్న నిల్వలను జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ ధ్రువీకరించింది.
పాకిస్థాన్‌లో ఓ వైపు నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు కొండెక్కాయి. మరోవైపు వరుస ఉగ్రదాడులతో ఎంతో మంది ప్రజలు, సైనికులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం నిల్వలు బయటపడ్డాయనే వార్త భవిష్యత్తుపై పాక్‌కు కొత్త ఆశలను రేకెత్తించింది. వెలికితీత ప్రక్రియ మొదలైతే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కొత్త రెక్కలు తొడిగేందుకు ఆస్కారం ఉంది. దేశంపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు బాటలు పడతాయి. పాక్ కరెన్సీ విలువ కొంతమేర బలోపేతం అవుతుంది. వెరసి నిత్యావసరాల ధరలు, ఇంధన ధరలు దిగొచ్చి సామాన్య ప్రజలకు ఊరట లభిస్తుంది. అటోక్ జిల్లాలోని సింధు నదిలో బంగారం నిల్వలను వెలికితీసే ప్రక్రియను ప్రారంభించడంపై పూర్తి దృష్టి పెట్టామని పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ ప్రకటించారు. 32 కిలోమీటర్ల పరిధిలో బంగారం నిల్వలు విస్తరించి ఉన్నాయని ఆయన తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akhanda 2: అఘోరాల మధ్య అఖండ -2 “తాండవం” షూటింగ్
ఈ ఆకులను చీప్‌గా చూడకండి.. నాలుగు ఆకులు తిన్నారంటే రోగాలన్నీ పరార్

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
