నడిరోడ్డుపై భారీ దోపిడి.. బైక్‌పై వచ్చి కాల్పులు
బీదర్‌లో బీభత్సం సృష్టించారు దోపిడీ దొంగలు. ఏటీఎంకు డబ్బు తరలిస్తున్న వాహనంపై దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. బీదర్‌లోని శివాజీ చౌక్ దగ్గర జరిగిందీ ఘటన. బైక్‌పై వచ్చిన దుండగులు ఐదు రౌండ్లు కాల్పులు జరిపి, మనీ బాక్స్‌తో పారిపోయారు. బీదర్ నడిబొడ్డున జరిగిన ఈ ఫైరింగ్‌తో అంతా ఉలిక్కిపడ్డారు.
నిందితులు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చి ఎటాక్ చేశారు అంతా మిస్టరీగానే ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు ఎటువైపు పరారయ్యారో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చూస్తుంటే ఈ గ్యాంగ్ పక్కాగా రెక్కీ చేసి ఇలా ఎటాక్ చేసినట్టు అర్థమవుతోంది. గన్స్‌తో రావడం, ఎటాక్ చేయడం.. ఆపై డబ్బుతో పారిపోవడం అంతా కళ్లుమూసి తెరిచేలోగా జరిగిపోయింది. నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కర్నాటకలోని బీదర్‌లో CMS ఏజెన్సీకి చెందిన సిబ్బంది జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎంలో లోడ్ చేయడానికి తమ సెక్యూరిటీ వాహనంలో డబ్బు తీసుకొచ్చారు. ఆ డబ్బులను ATMలో పెట్టేందుకు సిద్ధమైన టైమ్‌లో ఈ ఫైరింగ్ జరిగింది. వాహనంలోంచి డబ్బు తీసి ATM లో డిపాజిట్ చేయడానికి వెళుతుండగా అప్పటికే మాటు వేసి అక్కడున్న ముఠా బైక్‌పై వేగంగా వచ్చి కాల్పులు జరిపింది. ఈ దాడిలో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది స్పాట్‌లోనే చనిపోయారు. నగరం నడిబొడ్డున పట్టపగలు ఈ దోపిడికి పాల్పడటం కలకలం రేపింది. దోపిడీ ముఠా కోసం విచారణ ముమ్మరం చేశామని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
H-1B Visa: అమెరికన్ ఉద్యోగులకు H1B ముప్పు
మహా కుంభమేళాలో గోల్డెన్ బాబా.. ఒళ్లంతా బంగారమే
నరకం నుంచి విముక్తి.. హమాస్ బందీల భావోద్వేగం..

సింహం వేట మామూలుగా లేదు అమాంతం గాల్లోకి ఎగిరి మరీ

కుంభమేళాలో ఛార్జింగ్ తో గంటకు రూ.1000 సంపాదిస్తున్న యువకుడు..

బాయ్ ఫ్రెండ్ బ్లాక్ చేసాడని 100 డైల్ చేసిన గర్ల్ ఫ్రెండ్..

భార్య కోసం వెతికి ఆసుపత్రిలో చేరి భర్త.. సీన్ కట్ చేస్తే..

భర్త కాదు ఉన్మాది..సూసైడ్ చేసుకున్న ఓ ఇల్లాలి కథ వీడియో

దారుణం కత్తితో పొడిచి, యాసిడ్ పోసిన యువకుడు..వీడియో

రూ.7.8 కోట్ల ప్యాకేజీతో ప్రమోషన్, కానీ జీవితం కోల్పోయిన టెకీ ..
