Andhra News: అయ బాబోయ్.. ఇది ఇంత ఉందేంటి.. ఆ ఇంటి మనిషే ఆశ్చర్యపోయాడు..
కర్రపెండలం దుంప ఏడాది పొడుగునా లభిస్తుంది. ఇది చాలా చౌకగా మార్కెట్లో దొరుకుతుంది. ఇంకా చెప్పాలంటే దీనికి పేదవారి ఆహారం అంటుంటారు. నార్మల్‌గా ఇవి కేజీ నుంచి 5 కేజీల వరకు పెరుగుతాయి. కానీ కొవ్వాడ గ్రామంలోని ఓ వ్యక్తి పెరట్లో కర్రపెండలం మాత్రం.. బాహుబలి మాదిరిగా భారీ సైజ్ పెరిగింది.
కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ గ్రామంలో గోపిశెట్టి సూర్యనారాయణ పెరటిలో సుమారు 15 కేజీల పెండలం దుంప పెరిగింది. సాధారణంగా పెండలం దుంప ఒక కేజీ నుంచి ఐదు కేజీలు మాత్రమే ఉంటుంది. కానీ 15 కేజీల పెండలం దుంపను చూసి ఆశ్చర్యపోయాడు ఇంటి యజమాని. గతంలో కూడా సుమారు 20 కేజీల పైన ఉండే పెండలం దుంప తయారైందని సూర్యనారాయణ చెబుతున్నారు. అడుగున్నర గోతిలో పావు కేజీ దుంపని పూడ్చినట్లు సూర్యనారాయణ చెప్పారు. తమ పరిధిలో మొక్కలను పెంచడం వాటికి తానే తయారుచేసిన ఎరువులు వేయడంతో బాగా తయారయిందని అంటున్నారు. తన పెరట్లో కాసినవి ఎప్పుడూ అమ్ముకోనని.. ఈ పెండ్లం దుంపను కుటుంబ సభ్యులు అందరికి పంచి, మిగిలితే తన మిత్రులకు కూడా పంచుతానని అంటున్నాడు సూర్యనారాయణ. ఇంకా తన పెరట్లో పసుపు కొమ్ములు, చామంతి పలు రకాల పూల మొక్కలను కూడా పెంచుతున్నట్లు తెలిపారు యజమాని సూర్యనారాయణ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

