Telangana: ఇంటి పెరట్లోని సీతాఫలం చెట్టు వద్ద నుంచి చప్పుళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా..
ఆ ఇంటి పెరట్లో పూల మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుతోంది. ఓ సీతాఫలం చెట్టు కూడా ఉంది. ఆ పొదల నుంచి పదే, పదే చప్పుళ్లు వినిపించాయి. ఏంటా అని వెళ్లి చూసిన మహిళ గుండె ఆగినంత పనైంది. గట్టిగా కేకలు వేస్తూ అక్కడి నుంచి పరుగులు తీసింది. ఇంతకూ అక్కడ ఏముంది...?
వనపర్తి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. పెబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో ఇంటి పెరట్లో ఉన్న సీతాఫలం చెట్టు వద్ద నుంచి అదే పనిగా చప్పుళ్లు వినిపించాయి. ఆ ఇంటి మహిళ కవిత ఏంటా అని వెళ్లి చూడగా.. భారీ మొసలి కనిపించింది. తీవ్ర భయంతో బిగ్గరగా కేకలు వేస్తూ పరుగులు తీసింది. దీంతో స్థానికులు ఆ ఇంటికి వచ్చి చూసి భారీ మొసలి కావడంతో.. స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారమిచ్చారు. వారు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సిబ్బందితో అక్కడికి చేరుకుని.. దాదాపు 11 అడుగుల పొడవు.. 230 కేజీల బరువున్న భారీ మొసలిని అతి కష్టం మీద బంధించారు. అనంతరం కృష్ణా నదిలో ఆ మొసలిని వదిలిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలు మొసలి గ్రామంలోకి ఎలా వచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు.
దగ్గర్లోని వరద కాలువ నుంచి మొసలి ఇళ్ల మధ్యకు వచ్చి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. చెరువులు, కుంటలు, మడుగులకు సమీప ప్రాంతాల్లో నివశించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..

యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్ ఏం జరిగిందంటే? వీడియో

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

అరె ! కుక్క కోసం రూ.50 కోట్లా వీడియో

గుడ్లు పెట్టే వరకేనండోయ్.. ఆ తర్వాత తల్లి పక్షి జంప్ ..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో
