ప్రియురాలి భర్తను.. కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు డ్రైవర్. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారులో డ్రైవర్‌తో తన భార్య కలిసి ఉండడాన్ని చూడడమే ఆ వ్యక్తి చేసిన పాపం అయిపోయింది. వెంటనే ఆ కారును ఆపేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో కారు బానెట్ పై పడ్డాడు. అయినా కారు ఆపకుండా ఆ డ్రైవర్ అలాగో ముందుకు ఈడ్చుకెళ్లాడు. సమీర్ అనే వ్యక్తి తన భార్య.. మహీర్ అనే వ్యక్తితో కారులో ఉండడాన్ని చూశాడు. వెంటనే తన బైక్‌తో ఆ కారును అడ్డుకుని ఆపడానికి ప్రయత్నించాడు. మహీర్ తన కారును ఆపకుండా అలాగే పోనిచ్చాడు. దీంతో కారు బానెట్‌పై సమీర్ పడ్డాడు. బానెట్‌ను పట్టుకుని వేలాడుతున్న అతడిని అలాగే కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లాడు. పలువురు వాహనదారులు గమనించి, కారును ఆపమని హెచ్చరించారు. అయినా వినకపోవడంతో వెంబడించి కారును అడ్డుకున్నారు. అనంతరం మహీర్‌తో సమీర్ ఘర్షణకు దిగాడు. కారు బానెట్‌పై తనను ఈడ్చుకెళ్లడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మహీర్‌ను అరెస్ట్ చేశారు. అతడి కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామన్నారు పోలీసులు. మరోవైపు కొందరు వాహనదారులు రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

