EPF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై అంతా ఆన్‌లైన్‌లోనే..
కారణం ఏదైనా చాలామంది కార్మికులు ఈపీఎఫ్ అకౌంట్‌ల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వ్యక్తిగత వివరాలు అప్‌డేట్ చేయడం, అకౌంట్ ట్రాన్స్‌ఫర్ సహా మరి కొన్ని మార్పులు చేర్పుల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడేసేందుకు EPFO పలు మార్పులు చేస్తూ వస్తోంది. ఇటీవల మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై ఖాతాల బదిలీని మరింత సరళతరం చేసింది. యాజమాన్యాలతో ప్రమేయం లేకుండా, వారి అనుమతి లేకుండానే ఉద్యోగులు ఎవరికి వారే తమ ఖాతాలను బదిలీ చేసుకునే వెసులు బాటును జనవరి 18 శనివారం నుంచే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితంగా యాజమాన్యాల చుట్టూ తిరగడం, సమయం వృథా కావడం తప్పుతుంది. అయితే, ఈ సదుపాయం 2017 అక్టోబర్ 1వ తేదీ తర్వాత జారీ అయిన UAN తో ఆధార్ అనుసంధానమైన ఖాతాలకు మాత్రమే వర్తిస్తుందని ఈపీఎఫ్‌వో తెలిపింది. వ్యక్తిగత వివరాల్లో మార్పులు, అకౌంట్ ట్రాన్స్‌ఫర్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు దానిని ఉపసంహరించుకుని, ఆన్‌లైన్‌లో ఎవరికి వారే ఈ మార్పులు చేసుకోవచ్చు. అయితే, 2017కు ముందు నాటి ఖాతాలకు మాత్రం ఇది వర్తించదు. షరా మామూలుగానే వారి యాజమాన్యాలే ఈ పని చేయాల్సి ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

