అమెరికా అధ్యక్షుడి జీతమెంత ?? ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి ??
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడుగా చేసే వ్యక్తికి జీతం ఎంతుంటుందో అనే అలోచన రావడం సహజం. అసలే సంపన్న రాజ్యం.. దేశ విదేశాలనుంచి అక్కడికి వలస వెళ్తుంటారు.. అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటారు. మరి అంతటి సంపన్న దేశాన్ని పాలించే అధ్యక్షుడికి జీతమంటే ఓ రేంజ్‌లో ఉంటుందేమో అనుకుంటారు ఎవరైనా.
అనుమానం ఎందుకు..? ఓసారి ఆ వివరాలేంటో తెలిసేసుకుంటే పోలా.. అమెరికా అధ్యక్షుడి జీతభత్యాలేంటి? వాళ్లు పొందే సౌకర్యాలేంటో చూద్దాం. దేశాధ్యక్ష పదవి చేపట్టిన వారికి ఏడాదికి 4 లక్షల డాలర్లు అంటే 3.36 కోట్ల రూపాయిలు జీతంగా లభిస్తుంది. అంటే నెలకు రూ.28 లక్షల వేతనం అందుతుంది. ఇతర ఖర్చుల కింద ఏడాదికి మరో 50 వేల డాలర్లు అంటే రూ.42 లక్షలు, ప్రయాణ ఖర్చులకి లక్ష డాలర్లు అంటే 84 లక్షల రూపాయలు, వినోదం కోసం 19 వేల డాలర్లు అంటే రూ.16 లక్షలు ప్రెసిడెంట్‌కి చెల్లిస్తారు. అధ్యక్షుడిగా ఎన్నికయినవారికి వైట్ హౌస్ అధికారిక నివాసంగా ఉంటుంది. దానిని వారికి నచ్చిన విధంగా మార్చుకోడానికి ప్రభుత్వం లక్ష డాలర్లు చెల్లిస్తుంది. అధ్యక్షుడి అధికారిక పర్యటన కోసం అత్యాధునిక సాంకేతికత, భద్రత కలిగిన ది బీస్ట్ కారు, మెరైన్ వన్ ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఉపయోగిస్తారు. దేశాధ్యక్షుడికి వంట చేసి పెట్టడానికి ఎగ్జిక్యూటివ్ చెఫ్ ఉంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: వెంకీతో రూ. 50 కోట్లే కష్టం అన్నారు కానీ కట్ చేస్తే…| బుల్లి రాజుకు కష్టాలు
రోగం కాదు.. ఓవర్ యాక్షన్.. పబ్లిసిటీ కోసమే కదా.. ఈ కథలు!
Akhil Akkineni: అయ్యవారి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ ?
షూటింగ్ పేరుతో అడవిలో మంటలు.. హీరోకు వార్నింగ్ ఇచ్చిన గ్రామస్థులు
ఈ ఆకులను చీప్‌గా చూడకండి.. నాలుగు ఆకులు తిన్నారంటే రోగాలన్నీ పరార్

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..

వారానికి 90 గంటల పని.. రోడ్డెక్కిన టెకీలు

ఈ చిన్నారుల ట్యాలెంట్‌కి ఎవరైనా అదరహో అనాల్సిందే
