భోజనం పెట్టడం లేదు.. ఫోన్లు లాక్కున్నారు.. కాపాడండి ప్లీజ్‌..

రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఓ వీడియో విడుదల చేశారు. రష్యా పర్యటనకు వెళ్లిన కొందరు భారతీయులు ఊహించని విధంగా అక్కడి ఆర్మీ వద్ద చిక్కుకుపోయారు . ఉక్రెయిన్‌తో యుద్ధంలో మాస్కో సైన్యానికి సహాయకులుగా పని చేస్తున్నారు. వారిని విడిపించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా వారు మరో వీడియో విడుదల చేశారు.

భోజనం పెట్టడం లేదు.. ఫోన్లు లాక్కున్నారు.. కాపాడండి ప్లీజ్‌..

|

Updated on: Mar 19, 2024 | 7:50 PM

రష్యా సైన్యంలో చిక్కుకుపోయిన భారతీయులు తమను కాపాడాలంటూ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఓ వీడియో విడుదల చేశారు. రష్యా పర్యటనకు వెళ్లిన కొందరు భారతీయులు ఊహించని విధంగా అక్కడి ఆర్మీ వద్ద చిక్కుకుపోయారు . ఉక్రెయిన్‌తో యుద్ధంలో మాస్కో సైన్యానికి సహాయకులుగా పని చేస్తున్నారు. వారిని విడిపించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా వారు మరో వీడియో విడుదల చేశారు. తమను కాపాడాలంటూ కేంద్రాన్ని వేడుకొన్నారు. రష్యా ఆర్మీ యూనిఫామ్‌లో ఉన్న ఆరుగురు భారతీయులు ఉక్రెయిన్‌లోని జపొరిజియా ఓబ్లాస్ట్‌ ప్రాంతంలో ఈ వీడియోను చిత్రీకరించారు. వీరంతా పంజాబ్‌, హరియాణాకు చెందిన వారిగా తెలుస్తోంది. తాము రష్యా సైన్యంలో చిక్కుకుపోయామనీ, రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉన్న విషయం తెలుసుననీ మాస్కోలోని భారత ఎంబసీని సంప్రదించి వీలైనంత త్వరగా తమను విడిపించాలంటూ 26 సెకన్ల వీడియోలో వారు ప్రధాని మోదీని వేడుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెట్టింట కన్నీరు పెట్టిస్తున్న వీడియో.. ఏం జరిగిందంటే ??

అంతరిక్షంలో భారత్‌ స్పేస్‌ స్టేషన్‌.. 2040 కల్లా పూర్తి చేసేలా సన్నాహాలు

Naga Chaitanya: ధూత సీక్వెల్‌కు రెడీ అంటోన్న నాగచైతన్య

కుక్కలకు పార్వో వైరస్.. మనుషులకు పొంచి ఉన్న ముప్పు

నెట్టింట చక్కర్లు కొడుతున్న మెగాస్టార్‌ టెన్త్‌ సర్టిఫికెట్‌.. పాసయ్యరా ??

Follow us