అరుణాచల్ ప్రదేశ్ మాదే.. చైనా ప్రకటన
విస్తరణ వాదంతో రెచ్చిపోతున్న చైనా మరోసారి అరుణాచల్ ప్రదేశ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. చైనా జిజాంగ్‌గా పిలుచుకునే అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనని స్పష్టం చేసింది. ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో సేలా సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. ఈ పర్యటనపై చైనా అభ్యంతరం చెప్పగా కమ్యూనిస్టు దేశం వాదనలను భారత్ తోసిపుచ్చింది. దీనిపై స్పందించిన చైనా.. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగంలోని ప్రాంతమేనని ప్రకటించింది.
విస్తరణ వాదంతో రెచ్చిపోతున్న చైనా మరోసారి అరుణాచల్ ప్రదేశ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. చైనా జిజాంగ్‌గా పిలుచుకునే అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనని స్పష్టం చేసింది. ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో సేలా సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. ఈ పర్యటనపై చైనా అభ్యంతరం చెప్పగా కమ్యూనిస్టు దేశం వాదనలను భారత్ తోసిపుచ్చింది. దీనిపై స్పందించిన చైనా.. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగంలోని ప్రాంతమేనని ప్రకటించింది. చట్టవ్యతిరేకంగా భారత్ ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తాము ఎప్పటికీ ఒప్పుకోమని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్‌లో సరిహద్దు వెంబడి మిలిటరీ సన్నద్ధతను పెంచేలా కేంద్ర ప్రభుత్వం సెలా టన్నెల్ నిర్మించిన విషయం తెలిసిందే. సరిహద్దు వెంబడి సైన్యాల తరలింపునకు ఈ టన్నెల్ ఎంతో ఉపయోగపడుతుంది. అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే సెలా సొరంగ మార్గం దేశభద్రత రీత్యా అత్యంత కీలకంగా మారింది. 13 వేల అడుగుల ఎత్తున ఈ సొరంగ మార్గం ప్రపంచంలోనే అతిపెద్ద బైలేన్ టన్నెల్‌గా పేరుగాంచింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి

