AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hot Balloon Guinness: 21 వేలకు పైగా అడుగుల ఎత్తులో, కళ్లకు గంతలు కట్టుకొని.. గిన్నిస్‌ రికార్డ్‌ కోసం ఎంత సాహసమో..

Hot Balloon Guinness: అందరూ చేసే పనికి భిన్నంగా చేస్తే గుర్తింపు లభిస్తుంది. అలాంటి వారికి సమాజం కూడా గౌరవిస్తుంది. ఇలా అసామాన్య పనులు చేసే వారికి గుర్తించి, ప్రపంచానికి పరిచయం చేసేదే...

Hot Balloon Guinness: 21 వేలకు పైగా అడుగుల ఎత్తులో, కళ్లకు గంతలు కట్టుకొని.. గిన్నిస్‌ రికార్డ్‌ కోసం ఎంత సాహసమో..
Gunnis Record
Narender Vaitla
|

Updated on: Aug 30, 2021 | 12:01 PM

Share

Hot Balloon Guinness: అందరూ చేసే పనికి భిన్నంగా చేస్తే గుర్తింపు లభిస్తుంది. అలాంటి వారికి సమాజం కూడా గౌరవిస్తుంది. ఇలా అసామాన్య పనులు చేసే వారికి గుర్తించి, ప్రపంచానికి పరిచయం చేసేదే గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌. ఊహకు అందని ఫీట్లు చేస్తూ, తమ అసాధారణ ప్రతిభతో గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకుంటుంటారు కొందరు. అయితే ఇందులో భాగంగా కొందరు చేసే ఫీట్లు చూస్తుంటే కొన్ని సందర్భాల్లో వింతంగా ఉంటే మరికొన్ని మాత్రం భయాన్ని కలిగిస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ గిన్నిస్‌ రికార్డునే సాధించాడు యూకేకు చెందిన ఓ వ్యక్తి.

వివరాల్లోకి వెళితే యూకేకు చెందిన మైక్‌ హావర్డ్‌ అనే వ్యక్తి 21,400 అడుగుల ఎత్తులో రెండు హాట్‌ బెలున్న మధ్య నడిచి గిన్నిస్‌ రికార్డులో స్థానం సంపాదించుకున్నాడు. రెండు హాట్‌ బెలూన్స్‌ మధ్య ఉన్న ఓ చిన్న వంతెనపై నడవడం విశేషం. అయితే ఓసారి కళ్లు తెరిచి నడిస్తే మరోసారి కంటికి అడ్డుగా మాస్క్‌ను ధరించి నడవడం మరో విశేషం. విపరీతమైన చలి, ఆక్సిజన్‌ కూడా సరిగా అందని చోట అసలు మాములుగా ఉండడమే కష్టమైన విషయం. అలాంటి పరిస్థితుల్లో ఇంతటి సాహసంతో కూడుకున్న అద్భుత ఫీట్‌ చేయడం అంటే ఎంత సాహసంతో కూడుకున్న విషయమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతటి సాహసాన్ని సాకారం చేశాడు కాబట్టే మైక్‌ను గిన్నిస్‌ రికార్డు వరించింది. ప్రస్తుతం ఈ సాహసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చూసే వారికి భయం వేస్తుంటే అతను అంత ఎత్తులో ఎలా నడిచాడోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Post Office Schemes: పోస్టల్‌ శాఖ అందించే ముఖ్య పథకాలు.. ఏ స్కీమ్‌లో ఎంత రాబడి.. ఎంత వడ్డీ రేటు..!

AP CM Jagan: రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.. రిపేర్ చేయించండని సీఎం జగన్‌కు సర్పంచ్ లేఖ.. పరుగులు పెట్టిన అధికారులు

Samsung Cloud: మీరు సామ్‌సంగ్‌ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారా.? అయితే వెంటనే ఈ పని చేయండి. లేదంటే మీ డేటా అంతా..