Viral Video: మనుషులకైతే కూటి కొరకు కోటి విద్యలు.. మరి జంతువులు.. ఈ నక్క, పాము పోరాటం చూస్తే మీకే తెలుస్తుంది.
Viral Video: ఈ సృష్టిలో ప్రతీ జీవి అస్థిత్వ పోరాటం కోసమే ఆరాటపడుతుంది. ప్రతి జీవి అంతిమ లక్ష్యం జీవించడం అది ఎలాగైనా.. మానవులకు తెలివి, జ్ఞానం ఉంటుంది కాబట్టి డబ్బులు సంపాదంచుకొని జీవిస్తాడు. అందుకే...
Viral Video: ఈ సృష్టిలో ప్రతీ జీవి అస్థిత్వ పోరాటం కోసమే ఆరాటపడుతుంది. ప్రతి జీవి అంతిమ లక్ష్యం జీవించడం అది ఎలాగైనా.. మానవులకు తెలివి, జ్ఞానం ఉంటుంది కాబట్టి డబ్బులు సంపాదంచుకొని జీవిస్తాడు. అందుకే కూటి కోరకు కోటి విద్యలు అని చెబుతుంటారు. మనుషుల వరకు ఓకే మరి జంతువుల పరిస్థితి ఏంటి.? అవి కూడా అంతే తిండి కోసం పోరాటం చేస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని జంతువుల పోరాటం సాధారణంగా ఉంటే మరి కొన్నింటి వేట మాత్రం రోమలు నిక్కపొడిచేలా చేస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది.
సహారా ఎడారిలో ఎండ దంచికొడుతోంది. అదే సమయంలో తీవ్ర ఆకలితో ఉన్న ఓ నక్క అటువైపుగా వచ్చింది. అక్కడే ఇసుకలో పాకుతూ వెళుతోన్న ఓ పాము దాని దృష్టిలో పడింది. దీంతో ఆ పూటకు తిండి దొరికిందని మురిసిపోయిందా నక్క.. అయితే అది అంత సులువా.?అసలికే అదో విష సర్పం. ఆ విషయం నక్కుకు కూడా తెలుసు.. కానీ ఆకలి పోరాటం కోసం తప్పదు. దీంతో పాముపైకి దాడి చేయడానికి సిద్ధమైంది. అవకాశం చిక్కినప్పుడల్లా ఆ పాముపై దాడికి దిగింది. ఈ క్రమంలో తన ప్రాణాలు కాపాడుకోవడానికి పాము సైతం తీవ్రంగా కృషి చేసింది. నక్కపైకి బుసలు కొడుతూ భయపెట్టే ప్రయత్నం చేసిందా సర్పం. అయితే కాసేపు పోరాడిన పామును నక్కదాడికి తట్టుకోలేకపోయింది. చివరికి ప్రాణాలు వదిలింది. దీంతో మరణించిన ఆ పామును లాక్కెళ్లి ముళ్ల పొదల మాటున ఇసుకను తవ్వి అందులోకి వెళ్లి లాగించేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తుంటే అస్థిత్వ పోరాటం ఇంత భయంకరంగా ఉంటుందా?అన్న ప్రశ్నలు తలెత్తక మానదు. హంటింగ్ అండ్ ఎంటర్‌టైనర్ అనే యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఇప్పటి వరకు ఈ వీడియోను కోటిన్నర మందికి పైగా నెటిజన్లు వీక్షించారు. గగుర్పొడిచే ఈ అద్భుత వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
నక్క, పాముల భీకర పోరాటం..
మానవత్వం ఎక్కడా..? అని ఎవరైనా అడిగితే ఈ స్టోరీ చూపించండి.. ఈ మహిళకు వేల వేల వందనాలు
Soundarya : సినీవినీలాకాశంలో తారలెన్నున్నా ధ్రువతార మాత్రం సౌందర్యే…