Soundarya : సినీవినీలాకాశంలో తారలెన్నున్నా ధ్రువతార మాత్రం సౌందర్యే…
సినిమా తారలు ఎంతమంది ఉన్న కొంతమంది హీరోయిన్లు సినిమా పరిశ్రమ పై తమ ముద్ర వేస్తారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు సౌందర్య.
సినిమా తారలు ఎంతమంది ఉన్న కొంతమంది హీరోయిన్లు సినిమా పరిశ్రమ పై తమ ముద్ర వేస్తారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు సౌందర్య. అందం అభినయానికి పెట్టింది పేరు సౌందర్య. పేరుకు తగ్గట్టు సౌందర్యం ఆమె సొంతం. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయే సొందర్య మనల్ని వదిలి వెళ్లి నేటికి 17 ఏళ్ళు పూర్తయింది. తెలుగు,తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి అలరించారు సౌందర్య. ఆమె మరణించి 17 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ సౌందర్యను మరిచిపోలేకపోతున్నారు ఫ్యాన్స్. తమిళ, కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించింది సౌందర్య. ఈమె అసలు పేరు సౌమ్య.. పుట్టింది కర్ణాటకలో అయినా తెలుగులోనే అత్యధిక సినిమాలు చేసింది. చనిపోయేవరకు సౌందర్య టాప్ హీరోయిన్గా కొనసాగింది. రోజా, రమ్యకృష్ణ, మీనా లాంటి అగ్రహీరోయిన్లు తమ గ్లామర్‌తో గట్టిపోటీ ఇచ్చినా.. సౌందర్య మాత్రం సంప్రదాయపు అమ్మాయిగానే సినిమాల్లో నటించింది. చిన్నవయసులోనే హెలికాఫ్టర్ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లి సినీప్రేమికులకు శోకాన్ని మిగిల్చారు సౌందర్య. ఆమె చనిపోయే నటికి ఆమె వయసు 31 సంవత్సరాలే.. సావిత్రి తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న నటి ఎవరైనా ఉన్నారంటే.. అది సౌందర్య మాత్రమే. ఇక సౌందర్యకు అప్పట్లో ఇండస్ట్రీలో స్నేహితులు కూడా తక్కువే. హీరోల్లో జగపతిబాబు, శ్రీకాంత్.. హీరోయిన్లలో ఆమనితో ఎక్కువగా క్లోజ్‌గా ఉండేది. నేటి సౌందర్యను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేటికీ సౌందర్య సినిమా వస్తుందంటే ఇంట్లో ఆడవాళ్ళంతా.. టీవీలకు అతుక్కుపోతారు. ఇప్పటికీ ఎప్పటికీ సౌందర్య ఓ ధ్రువ తారే..
మరిన్ని ఇక్కడ చదవండి :