మానవత్వం ఎక్కడా..? అని ఎవరైనా అడిగితే ఈ స్టోరీ చూపించండి.. ఈ మహిళకు వేల వేల వందనాలు
మనుషులుగా అందరూ పుడతారు.. కానీ మనుషులుగా బ్రతికేవాళ్లు ఎంతమంది చెప్పండి. అవును ఇప్పుడు ప్రపంచం ఉన్న కష్టకాలంలో స్వచ్చమైన మనుషులు కావాలి.
మనుషులుగా అందరూ పుడతారు.. కానీ మనుషులుగా బ్రతికేవాళ్లు ఎంతమంది చెప్పండి. అవును ఇప్పుడు ప్రపంచం ఉన్న కష్టకాలంలో స్వచ్చమైన మనుషులు కావాలి. సాటి మనిషికి సాయంగా నిలవాలి. మన దగ్గర ఎంత ఉందని కాదు.. ఉన్నదాంట్లో మనం ఎంత సాయం చేయగలమో చూడాలి. తాజాగా తనలో ఉన్న మానవత్వాన్ని, దయాగుణాన్ని చాటుకున్నాడు రోడ్ పక్కన బిర్యానీ అమ్ముకునే ఓ మహిళ.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల రేడియో జాకీ-నటుడు ఆర్జే బాలాజీ ట్విట్టర్ పోస్ట్‌లో రెండు చిత్రాలు షేర్ చేశారు. “కోయంబత్తూరులోని పులియాకుళంలోని ఓ చిన్న రోడ్డు పక్కన ఉన్న బిర్యానీ షాపు సమాజానికి ఎంత గొప్ప సంకేతాలు పంపుతుంది. మానవత్వానికి ఇదే నిదర్శనం. ” అని ఆ పోస్ట్‌కు క్యాప్షన్ యాడ్ చేశారు.
సదరు ఫోటోలలో ఒకటి రోడ్డు పక్కన ఉన్న బిర్యానీ స్టాల్‌ను చూపిస్తుంది. మరొక ఫోటోలో పక్కనే కొన్ని తమిళ పదాలతో నిండివున్న బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు కింద కొన్ని ఫుడ్ ఫ్యాకెట్స్ ఉన్నాయి. ఆ పదాలను తమిళం నుంచి తెలుగులోకి అనువాదం చేయగా ఇది సారాంశం. “మీకు ఆకలిగా ఉందా, అయితే ఈ ఫుడ్ ఫ్యాకెట్స్ ఉచితంగా తీసుకోండి …. ప్రేమతో” అని రాసి ఉంది.
మానవత్వం పరిమళించిన ఆ పోస్ట్‌ను దిగువన చూడండి:
What a great gesture by this small roadside biryani shop in Puliakulam, Coimbatore.! Humanity at its best !!! ❤️ pic.twitter.com/VZYWgRzwaN
— RJ Balaji (@RJ_Balaji) April 15, 2021
ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ సర్కులేట్ అవుతుంది. నెటిజన్లు ఆ షాపు యజమానిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. “సూపర్, ఆమె మనసు చాలా గొప్పది ” అని ఒక ట్విట్టర్ యూజర్ రాశాడు. “దేవుడు ఆశీర్వదం ఆమెకు ఎల్లప్పుడూ ఉంటుందని” మరొకరు కామెంట్ పెట్టారు.
Also Read: ఆ ఇంటి ముందు డోర్ పంజాబ్‌లో తెరుచుకుంటే.. వెనుక డోర్ హర్యానాలో తెరుచుకుంటుంది
‘తండ్రి డబ్బును వేస్ట్ చేస్తున్నావ్’ అన్న నెటిజన్‌కు.. సారా టెండూల్కర్ సాలిడ్ కౌంటర్