AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేటీఆర్‌కి అహంకారం ఎక్కువా? సుత్తిలేకుండా సూటిగా ఆయన చెప్పిన సమాధానం ఇదే..

కేటీఆర్‌కి అహంకారం ఎక్కువా? సుత్తిలేకుండా సూటిగా ఆయన చెప్పిన సమాధానం ఇదే..

Ravi Kiran
|

Updated on: Apr 12, 2024 | 7:01 PM

Share

తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన టీఆర్ఎస్‌.. ప్రత్యేకరాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఫక్తు రాజకీయపార్టీగా అవతరించింది. బోటాబోటీ మార్కులతో 2014లో అధికారంలోకి వచ్చి, ప్రజావిశ్వాసం పొంది 2018లో 88 సీట్లతో వీరవిహారం చేసింది. అయితే బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్‌ ప్రజల ఆదరణ పొందలేకపోయింది.

తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన టీఆర్ఎస్‌.. ప్రత్యేకరాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఫక్తు రాజకీయపార్టీగా అవతరించింది. బోటాబోటీ మార్కులతో 2014లో అధికారంలోకి వచ్చి, ప్రజావిశ్వాసం పొంది 2018లో 88 సీట్లతో వీరవిహారం చేసింది. అయితే బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్‌ ప్రజల ఆదరణ పొందలేకపోయింది. గడిచిన ఐదేళ్లలో రాజకీయంగా అనుసరించిన విధానాలు, ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. దీనికి తోడు జాతీయపార్టీల దూకుడు కారణంగా హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకోవాలన్న బీఆర్ఎస్‌ కల నెరవేరలేదు. పదేళ్లుగా అధికారంలో ఉన్నా సంస్థాగతంగా పటిష్టమైన కేడర్‌ను నిర్మించకోలేకపోవడంతో ఇబ్బందుల్లో పడింది. మరోవైపు ఫిరాయింపుల ప్రవాహం నాయకత్వాన్ని కుదిపేస్తోంది. నమ్మకున్నవాళ్లే నట్టేట ముంచి పరాయి పంచన చేరుతుంటే బలంగా విమర్శించలేని దుస్థితి నెలకొంది. ఈ పార్లమెంట్‌ ఎన్నికలు పార్టీకి చావోరేవో అన్నట్టుగా మారాయి. భవిష్యత్తు ప్రశ్నార్ధకమన్న విమర్శల మధ్య బీఆర్ఎస్‌ జెండాను నిలబెట్టుకోవడం సవాలుగా మారింది. కేసీఆర్‌కు దళపతిగా రంగంలో దిగి పార్టీని నడిపించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న కల్వకుంట్ల తారకరామారావుతో ఎక్స్‌క్లూజివ్‌ క్రాస్‌ఫైర్‌

Published on: Apr 12, 2024 06:58 PM
Follow Us