Watch Video: చివరి ఓవర్లో హైడ్రామా.. హ్యాట్రిక్‌తో బౌలర్ దూకుడు.. 6 పరుగుల కోసం బ్యాటర్ల పోరు..!
Viral Video: ఇది అంతర్జాతీయ మ్యాచ్ కాదు. అలాగే ఈ మ్యాచ్ ఏ ప్రధాన లీగ్‌లో భాగం కానేకాదు. కానీ, ఉత్కంఠతలో మాత్రం ఈ మ్యాచులకు ఏమాత్రం తీసిపోదు.
Viral Video: క్రికెట్(Cricket) అంటే సాహసంతోపాటు ఉత్సాహం ఇచ్చే ఆట. ఎన్నో మ్యాచుల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. మరెన్నో మ్యాచులు చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగాయి. ప్రతి క్రికెట్ అభిమాని తప్పకుండా ఇలాంటి వాటిని ఎంజాయ్ చేస్తుంటాడు. తాజాగా ఓ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో అద్భుతం జరిగింది. బ్యాట్స్‌మెన్స్ వచ్చి వెళ్తున్నారు. బౌలర్ మాత్రం హ్యాట్రిక్(Hat Trick) తీసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అయితే, కొత్త బ్యాట్స్‌మెన్ స్ట్రైక్‌లోకి వచ్చాడు. చివరి బంతికి సిక్స్ కావాలి. ఆ బాల్ సిక్స్‌గానే అనిపించింది. చివర్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది అంతర్జాతీయ మ్యాచ్ కాదు. అలాగే ఈ మ్యాచ్ ఏ ప్రధాన లీగ్‌లోనూ భాగం కాదు. అయినా ఈ టీ20 మ్యాచ్‌లో ఉత్కంఠ నెలకొంది. ఇది సాధారణ టోర్నమెంట్‌లో ఆడిన మ్యాచ్. చివరి ఓవర్‌కు చేరిన ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠతకు గురి చేసింది. ఎందుకంటే, పరుగుల వేట సాగిస్తున్న జట్టులో మిడిలార్డర్ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ చేరుతూ కష్టాల్లో చిక్కుకపోయారు.
చివరి ఓవర్లో ట్విస్ట్.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన MOS జట్టు 154 పరుగులు చేసి UNSW ముందు 155 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు 19వ ఓవర్‌కు 148 పరుగులు చేసింది. దాదాపు విజయం ఖాయమైంది. కానీ, ఈ మ్యాచ్‌లో ఓ ట్విస్ట్‌తో ఉత్కంఠ విజంయ సాధించారు.
ఈ చివరి ఓవర్‌లో ఏం జరగిందంటే.. తొలి బంతికి పరుగులేమీ రాలేదు. రెండో బంతికే బౌలర్ టర్నర్ వికెట్ తీశాడు. ఆ తర్వాత మూడో బంతికి కూడా వికెట్ తీశాడు. నాలుగో బంతికి కూడా వికెట్ పడగొట్టాడు. ఇక విజయానికి చివరి 6 బంతుల్లో 7 పరుగులు కావాల్సిన సమయంలో బౌలర్ హ్యాట్రిక్ సాధించాడు. 5వ బంతికి సింగిల్ వచ్చింది. అంటే ఓవర్ చివరి బంతికి సిక్స్ కావాలి.
చివరి బంతికి సిక్స్.. చివరి బంతికి విజయం సాధించాలంటే 6 పరుగులు రావాలి. బ్యాట్స్‌మెన్ చూడకుండానే బంతిని బాదేశాడు. బంతి బౌండరీ లైన్ దాటి వెళ్లింది. చివరి ఓవర్లో ఉత్కంఠతతో UNSW జట్టు విజయం సాధించింది. దీంతో బ్యాట్స్‌మెన్‌లో ఉత్సాహంగా మైదానంలోనే గుమిగూడి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
This is the definition of ABSOLUTE SCENES.
Six to win from the last ball, bowler has just taken a hat-trick and it’s your first ball on strike…
How good ?? pic.twitter.com/tYl89zksqI
— Cricket District ? (@cricketdistrict) January 24, 2022
Also Read: T20 Records: 5000 పరుగులు, 400 వికెట్లు.. టీ20 రికార్డుల్లో తగ్గేదేలే అంటోన్న ఆల్‌రౌండర్..!
IND vs SA: ‘జై శ్రీరామ్’ అంటూ సౌతాఫ్రికా ప్లేయర్ ట్వీట్.. నెట్టింట్లో వైరల్.. ఎందుకంటే?