Ponguleti Srinivasa Reddy: టీడీపీ, కాంగ్రెస్ వేర్వేరు కాదు.. టీడీపీ ఆఫీస్‌లో మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు..
ఖమ్మం జిల్లా తెలుగుదేశం ఆఫీస్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందడి చేశారు. ఈ సందర్బంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి ఎలాంటి ప్రయోజనం లేకపోయినా తెలంగాణలో మార్పు కావాలని కోరుకున్న ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్‌కు మద్దతు పలికారన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు కాంగ్రెస్‌కు మద్దతు పలికారన్నారు.
ఖమ్మం జిల్లా తెలుగుదేశం ఆఫీస్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందడి చేశారు. ఈ సందర్బంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి ఎలాంటి ప్రయోజనం లేకపోయినా తెలంగాణలో మార్పు కావాలని కోరుకున్న ప్రజల అభీష్టం మేరకు కాంగ్రెస్‌కు మద్దతు పలికారన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు కాంగ్రెస్‌కు మద్దతు పలికారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ఎక్కడైన కాంగ్రెస్ నాయకులు ఆదమర్చి నిద్రపోయారేమో కానీ.. తెలుగు తమ్ముళ్లు మాత్రం నిద్రపోలేదన్నారు పొంగులేటి. కాంగ్రెస్ పార్టీ తరఫున టీడీపీ అధినేత చంద్రబాబుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నానన్నారు. టీడీపీ, కాంగ్రెస్ వేరువేరు కాదు.. భవిష్యత్‌లో అందరం కలిసి పనిచేద్దామని టీడీపీ నేతలతో అన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
ఖమ్మం టీడీపీ ఆఫీస్ కు వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. మొదట ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.
కాగా.. అంతకుముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా టీడీపీ కార్యాలయానికి చేరుకుని.. కార్యకర్తలతో మాట్లాడిన విషయం తెలిసిందే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..