KCR Oath: ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం
ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేసీఆర్ గెలుపొందిన విషయం తెలిసిందే. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్‌లో కేసీఆర్ ప్రమాణం చేశారు. రెండు టర్మ్‌లు సీఎంగా తన మార్క్ చాటుకున్న కేసీఆర్..విపక్ష నేతగా తెలంగాణ మూడో అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టారు.
ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేసీఆర్ గెలుపొందిన విషయం తెలిసిందే. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్‌లో కేసీఆర్ ప్రమాణం చేశారు. నేరుగా అసెంబ్లీకి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్. తుంటి ఎముకకు శస్త్ర చికిత్స కారణంగా అందరితో పాటు ప్రమాణస్వీకారం చేయలేకపోయారు గులాబీ అధినేత కేసీఆర్. కేసీఆర్ ప్రమాణస్వీకారం సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరిని ఆహ్వానించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీంతో నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
రెండు టర్మ్‌లు సీఎంగా తన మార్క్ చాటుకున్న కేసీఆర్..విపక్ష నేతగా తెలంగాణ మూడో అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న టైమ్‌లో కేసీఆర్ ఎర్రవల్లి కి చేరుకున్నారు. ఆ తరువాత ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. ఐతే బాత్రూంలో జారిపడి తుంటి ఎముకకు గాయం కావడంతో యశోదా హాస్పిటల్ చేరారు. సర్జరీ అనంతరం డిశ్చార్జ్ అయిన తరువాత హైదరాబాద్ నందినగర్‌లోని నివాసానికి వెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో క్రమక్రమంగా కోలుకున్నారు. ఇటీవల ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు కేసీఆర్. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తెలంగాణ తరపున పార్లమెంట్‌లో గళమెత్తాలని దిశా నిర్దేశం చేశారు.
ఇక ఈ నెల 17న కేసీఆర్ బర్త్ డే. అదే రోజున కేసీఆర్ బీఆర్‌ఎస్ లోకసభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం వుందని తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా సమీక్షలు నిర్వహించారు. అసెంబ్లీ స్థానాల్లో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశాలు జరుగుతున్నాయి. ఇక కేసీఆర్ ఎంట్రీతో కారు మళ్లీ టాప్ గేర్‌లోకి రావడం ఖాయమంటున్నారు బీఆర్‌ఎస్ లీడర్లు, క్యాడర్.
కొత్త సర్కార్ కుదుటపడేదాక వంద రోజులు వెయిట్ చేయాలని తొలుత భావించింది బీఆర్‌ఎస్. కానీ పార్లమెంట్ ఎన్నికల క్రమంలో 50 రోజులకే కాంగ్రెస్-బీఆర్‌ఎస్ మధ్య విమర్శల వాడివేడి జోరందుకుంది.
సారు..కారు ..పదహారు నినాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది బీఆర్‌ఎస్. తెలంగాణ దళం ..బలం తామేనంటూ లోక్‌సభ ఎన్నికలపై పూర్తిస్తాయిలో దృష్టిసారించింది. ఇన్ని రోజులు ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క. కేసీఆర్ ఎంట్రీతో కథ మరో లెవల్ ఉంటుందంటున్నాయి బీఆర్‌ఎస్ శ్రేణులు. అసెంబ్లీలో విపక్ష నేతగా బాధ్యతలు.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో కేసీఆర్ ఇక పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారిస్తారంటున్నారు. కరీంనగర్ కేంద్రంగా ఆయన పొలిటికల్ యాక్టివిటీ వుండబోతుందనే ప్రచారం జరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..