Kumari Aunty - Telangana: కుమారి ఆంటీ క్రేజ్.! 20 లక్షల మంది రాత మారుస్తుందా.?

Kumari Aunty – Telangana: కుమారి ఆంటీ క్రేజ్.! 20 లక్షల మంది రాత మారుస్తుందా.?

Anil kumar poka

|

Updated on: Feb 01, 2024 | 11:21 AM

కుమారి ఆంటీ. మీడియాలో ఇప్పుడు ఈ పేరు వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో అయితే చాలా రోజులుగా ఆమె వీడియోలు రన్ అవుతున్నాయి. అలాగని ఆవిడేమీ సెలబ్రెటీ కాదు. రాజకీయనాయకురాలూ కాదు. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఫుడ్ బిజినెస్ చేసే సాధారణ మహిళ. అలాంటి కుమారి ఫుడ్ స్టాల్ వల్ల ట్రాఫిక్ కు ప్రాబ్లమ్ అవుతోందంటూ పోలీసులు జోక్యం చేసుకున్నారు. దీంతో ఆమె బిజినెస్ ఆగింది. ఇది కూడా వైరల్ అవ్వడంతో ఏకంగా తెలంగాణ ప్రభుత్వం కలుగుచేసుకోవాల్సి వచ్చింది.

కుమారి ఆంటీ. మీడియాలో ఇప్పుడు ఈ పేరు వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో అయితే చాలా రోజులుగా ఆమె వీడియోలు రన్ అవుతున్నాయి. అలాగని ఆవిడేమీ సెలబ్రెటీ కాదు. రాజకీయనాయకురాలూ కాదు. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఫుడ్ బిజినెస్ చేసే సాధారణ మహిళ. అలాంటి కుమారి ఫుడ్ స్టాల్ వల్ల ట్రాఫిక్ కు ప్రాబ్లమ్ అవుతోందంటూ పోలీసులు జోక్యం చేసుకున్నారు. దీంతో ఆమె బిజినెస్ ఆగింది. ఇది కూడా వైరల్ అవ్వడంతో ఏకంగా తెలంగాణ ప్రభుత్వం కలుగుచేసుకోవాల్సి వచ్చింది. అసలు… ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి అవసరం ఎందుకొచ్చింది? ఈ వివాదం వెనుక కథేంటి? దేశంలో ఇలా చిరు వ్యాపారాలు చేసుకుని పొట్ట పోసుకునే దాదాపు 20 లక్షల కుటుంబాల పరిస్థితి ఏమిటి? సుమారు మూడున్నర లక్షల కోట్ల రూపాయిల ఈ వ్యాపారం ఎలా జరుగుతోంది? మరి కుమారి ఆంటీ లాంటివారికి సెక్యూరిటీ ఎలా? హైదరాబాద్ లోని రాయదుర్గం-మాదాపూర్ రోడ్డులో కుమారి ఫుడ్ స్టాల్ కనిపిస్తుంది. ఆవిడ అసలు పేరు.. దాసరి సాయికుమారి. భాగ్యనగరంలో బతుకుదెరువుకు వచ్చినవారికి ఇలాంటి ఫుడ్ స్టాల్స్ కొత్త కాదు. కానీ భోజనం కోసం వచ్చినవారిని.. ఆమె అభిమానంగా పలకరించే తీరు.. రకరకాల నాన్ వెజ్ వంటకాలు.. ఇవన్నీ ఆమెను సోషల్ మీడియాలో ఫేమస్ చేశాయి. దాంతోపాటు డిజిటల్ యుగంలో మీడియా అటెన్షన్ ను అటువైపు మళ్లేలా చేశాయి. అందుకే ఆమె వీడియోలకు రీచ్ పెరిగింది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వచ్చేవారు.. ఇక్కడోసారి భోజనం చేసి వెళ్లడానికి మక్కువ చూపించేవారు. అలా ఆమె ఫుడ్ స్టాల్ కు గిరాకీ పెరిగింది. అది కాస్తా సోషల్ మీడియాను బాగా అట్రాక్ట్ చేసింది. దీంతో పాపులారిటీ ఇంకా పెరిగింది.

కార్పొరేట్ ఉద్యోగులు, కొందరు సినిమావాళ్లు కూడా అక్కడే భోజనం చేస్తుంటారు. వివిధ రకాల నాన్ వెజ్ వంటకాలతో భోజనం అక్కడ సిద్ధంగా ఉంటుంది. ధర తక్కువ, రుచి ఎక్కువ అంటూ కామెంట్స్ రావడంతో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు బిజినెస్ పెరిగింది. పదేళ్లుగా అక్కడే ఫుడ్ బిజినెస్ నడిపిస్తోంది. ఆమె రోజుకు ఎంత బిజినెస్ చేస్తారు.. ఎంత లాభం వస్తుంది.. ఇలా రకరకాల టాపిక్స్ పై చర్చ జరిగింది. ఇలాంటి వీడియోలు.. మరింతమందిని ఆకర్షించాయి. దాదాపు నెల రోజుల నుంచీ సోషల్ మీడియా ఫుల్ గా ఫోకస్ పెట్టడంతో నెట్టింట ఇదే డిస్కషన్ జరిగింది. ఆమె ఫుడ్ స్టాల్ కు వచ్చే జనంతో పాటే.. ఆ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలు కూడా పెరిగాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఆమె భోజనాన్నితీసుకువచ్చే బండిపై కేసు పెట్టారు. అక్కడ స్టాల్ నిర్వహణ విషయంలో అభ్యంతరాలు కూడా రావడంతో ఈ విషయం బాగా పాపులర్ అయ్యింది. దీనిపై సోషల్ మీడియా అటెన్షన్ పే చేయడంతో.. చివరకు తెలంగాణ సర్కారు ముందుకు వచ్చింది. ఆమె అక్కడే వ్యాపారం చేసుకునేలా ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా పాలనకు తమ ప్రభుత్వం ప్రయార్టీ ఇస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమె స్టాల్ కు వస్తారన్న వార్తలు వచ్చాయి. దీంతో ఆయన రియాక్షన్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

కుమారి ఆంటీలాగే ఈ దేశంలో రోడ్డు పక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- FSSAI అంచనా ప్రకారం దాదాపు 20 లక్షలు. జనసంచారం ఎక్కువగా ఉన్నచోట, ఆఫీసులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇలాంటి ఫుడ్ స్టాల్స్ వీధిపక్కన చాలా కనిపిస్తాయి. క్వాలిటీ విషయంలో ఇబ్బందులు, అభ్యంతరాలూ ఉన్నా.. చాలామంది వీటివైపు మొగ్గు చూపిస్తున్నారు. నిజానికి వీటికి ప్రజాదరణ బాగోవడంతో కిందటి ఏడాది కేంద్ర ప్రభుత్వం కూడా ఓ అడుగు ముందుకు వేసింది. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో 100 ఫుడ్ స్ట్రీట్స్ ను ఏర్పాటు చేయాలనుకుంది. సిటీల్లో ఇలాంటివి ఇప్పటికే ఉన్నా.. ఒక్కో ఫుడ్ స్ట్రీట్ కు కోటి రూపాయిలు కేటాయిస్తామంది. దీనివల్ల రుచి, శుచి, శుభ్రతతో మంచి ఆహారాన్ని అందించడానికి వీలు కలుగుతుందని చెప్పింది. మన దేశంలో పానీ పూరీ మార్కెట్టే దాదాపు 6 వేల కోట్ల రూపాయిలు ఉంటుందని అంచనా. ఇక దేశవ్యాప్తంగా ఇలా వీధి పక్కన ఆహారం అమ్మేవారి వ్యాపారం దాదాపు 3 లక్షల 40 వేల కోట్ల రూపాయిలు. దీనిని బట్టి స్ట్రీట్ ఫుడ్ రేంజ్ మీకు అర్థమై ఉంటుంది. సో ప్రభుత్వం ఇలాంటివారికి అవసరమైన సదుపాయాలు కల్పించి.. నాణ్యత తగ్గకుండా ఆహారాన్ని అందించే ఏర్పాట్లు చేస్తే.. ఎక్కువమందికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది. సో.. ఒక స్ట్రీట్ వెండార్ విషయంలో ముఖ్యమంత్రే స్పందించారంటే.. ఈ బిజినెస్ చేసేవారి స్థాయి ఏంటో మీకు అర్థమై ఉంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos