Watch Video: డీకే శివకుమార్ హెలికాప్టర్‌లో ఈసీ అధికారుల తనిఖీలు..
కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ప్రయాణించిన హెలికాప్టర్‌లోనూ EC అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రచారం కోసం దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థలికి చేరుకున్న తర్వాత.. హెలిప్యాడ్‌లోనే శివకుమార్ ప్రయాణించిన హెలికాప్టర్‌ను చెక్ చేశారు.
కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ప్రయాణించిన హెలికాప్టర్‌లోనూ EC అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రచారం కోసం దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థలికి చేరుకున్న తర్వాత.. హెలిప్యాడ్‌లోనే శివకుమార్ ప్రయాణించిన హెలికాప్టర్‌ను చెక్ చేశారు. హెలికాప్టర్‌లో ఏమీ లభ్యంకాకపోవడంతో ఈసీ అధికారులు వెనుదిరిగారు. ఈసీ అధికారులు తన హెలికాప్టర్‌లో సోదాలు చేయడంపై డీకే శివకుమార్ స్పందించారు. వారు తనిఖీలు చేయడంలో తప్పులేదని, వాళ్లు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించినట్లు ఆయన చెప్పారు. తనను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడానికి బీజేపీ నేతలు చాలా కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నామినేషన్‌ను తిరస్కరించాలని అధికారులపై కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మై ఒత్తిడి చేశారని మండిపడ్డారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నేతలు సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్నారు. 224 మంది సభ్యులతో కూడిన కర్ణాటక అసెంబ్లీకి ఒకే విడతలో మే 10న పోలింగ్ నిర్వహించనున్నారు. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.