Mahesh Babu : ఇదెక్కడి మాస్ రా మావ..! మురారి రీరిలీజ్ హంగామా.. థియేటర్‌లో పెళ్లి చేసుకున్న ఫ్యాన్..
ఓ వైపు సోషల్ మీడియాలో అభిమానులు మహేష్ కు బర్త్ డే విషెస్ తెలుపుతుంటే.. మరోవైపు థియేటర్స్‌లో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మురారి సందడి చేస్తోంది. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంతో పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది.
మహేష్ బాబు బర్త్ డేకి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఓ వైపు సోషల్ మీడియాలో అభిమానులు మహేష్ కు బర్త్ డే విషెస్ తెలుపుతుంటే.. మరోవైపు థియేటర్స్‌లో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మురారి సందడి చేస్తోంది. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంతో పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీ రీ రిలీజ్ లో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. కాగా మురారి థియేటర్ లో ఓ ఫ్యాన్ జంట పెళ్లి కూడా చేసుకున్నారు. అలాగే కొన్ని థియేటర్స్ లో అక్షింతలు కూడా చల్లుతూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.