Harish Shankar: అది నిజం కావాలని ఆశిద్దాం.! పవన్ , రవితేజ పై డైరెక్టర్ కామెంట్స్..
తెలుగు ప్రేక్షకులకు మల్టీ స్టారర్ మూవీస్ కొత్తేం కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ మొదలు మొన్నటికి మొన్న వెంకటేష్, పవన్ కళ్యాణ్ వరకు.. అసలు సిసలైన మల్టీ స్టారర్ మూవీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ట్రిపులార్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటించి అభిమానులను ఫిదా చేశారు. ఇదిలా ఉంటే తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ మరో ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ మూవీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.

హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కిన చిత్రం మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదుల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న హరీష్ శంకర్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. మల్టీస్టారర్ మూవీ తీయాల్సి వస్తే.. ఎవరితో తీస్తారన్న ప్రశ్నకు బదులిస్తూ.. పవన్ కళ్యాణ్, రవితేజలతో చేస్తానని ఠక్కున ఆన్సర్ ఇచ్చారు.
అంతేకాదు సాధారణంగా వీరిద్దరిలో ఏ ఒక్కరు తెరపై కనిపించినా మాస్ ప్రేక్షకులు విజిల్స్ హోరెత్తిస్తారు. అలాంటిది ఇద్దరు హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే, పూనకాలతో ఊగిపోవడం ఖాయమని చెప్పుకొచ్చారు హరీష్ శంకర్. అయితే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలోనూ తెగ ట్రెండ్ అవుతోంది. దీంతో హరీష్ శంకర్ ఓ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. తనను చాలా మంది పవన్, రవితేజలతో సినిమా చేయాలని అడిగారని, అది కార్యరూపం దాల్చాలని ఆశిద్దాం అంటూ తన లేటెస్ట్ పోస్ట్లో రాసుకొచ్చాడు. తన ఆన్సర్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!