సామాన్యుల జీవితాలు మారాలనే ఆరు గ్యారెంటీలు: DK శివకుమార్
కర్నాటకలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, తెలంగాణలో ఇచ్చిన హామీలు కూడా కాంగ్రెస్ అమలు చేస్తుందని కర్నాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ అన్నారు. కర్నాటకలో ఇచ్చిన హామీలేవి కాంగ్రెస్ అమలు చేయడం లేదని BRS తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ తరపున ఆయన ప్రచారం చేశారు.
కర్నాటకలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, తెలంగాణలో ఇచ్చిన హామీలు కూడా కాంగ్రెస్ అమలు చేస్తుందని కర్నాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ అన్నారు. కర్నాటకలో ఇచ్చిన హామీలేవి కాంగ్రెస్ అమలు చేయడం లేదని BRS తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ తరపున ఆయన ప్రచారం చేశారు. పదేళ్లుగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న మోదీ, కేసీఆర్ ప్రజలకు ఏం చేశారని శివకుమార్ ప్రశ్నించారు. ఉచిత పథకాలు ఇస్తే దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని చెప్తున్న మోదీ అవే గ్యారెంటీలను మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఎందుకు ప్రకటిస్తున్నారని శివకుమార్ ప్రశ్నించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించలేదని శివకుమార్ స్పష్టం చేశారు. సామాన్యుల జీవితాలు మారాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ ఆరు గ్యారెంటీలు రూపొందించారని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..