Telangana: సంగారెడ్డి కాంగ్రెస్ సభలో ఆసక్తికర దృశ్యాలు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్న సంగారెడ్డిలో ఎన్నికల సభలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. వేదికపై ఓ వృద్ధ మహిళ ఇందిరమ్మపై పాట పాడగా జగ్గారెడ్డి ఆ పాటకు అర్థాన్ని రాహుల్‌కు వివరించి చెప్పారు. రాహుల్ తన ప్రసంగం చివరలో జగ్గారెడ్డిని దగ్గరకు తీసుకుని భుజంపై చేయి వేశారు. భారత్ జోడో సమయంలో జగ్గారెడ్డి అద్భుతంగా పనిచేశారని అభినందించారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొన్న సంగారెడ్డిలో ఎన్నికల సభలో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. వేదికపై ఓ వృద్ధ మహిళ ఇందిరమ్మపై పాట పాడగా జగ్గారెడ్డి ఆ పాటకు అర్థాన్ని రాహుల్‌కు వివరించి చెప్పారు. రాహుల్ తన ప్రసంగం చివరలో జగ్గారెడ్డిని దగ్గరకు తీసుకుని భుజంపై చేయి వేశారు. భారత్ జోడో సమయంలో జగ్గారెడ్డి అద్భుతంగా పనిచేశారని అభినందించారు. భారీ మెజార్టీతో జగ్గారెడ్డిని గెలిపించాలని రాహుల్ పిలుపునిచ్చారు. రాహుల్ ప్రసంగం ముగిశాక జగ్గారెడ్డి ఆయనకు ఒక ఆసక్తికర విషయం చెప్పారు. రాహుల్ ప్రసంగించిన మైదానంలోనే గతంలో ఇందిరాగాంధీ ప్రసంగించారని చెప్పారు. కార్యక్రమం చివరలో రాహుల్ ప్రేమ మాత్రమే తనకు చాలని, ఇంకేమీ అక్కర్లేదని జగ్గారెడ్డి చెప్పారు. రాహుల్ ప్రసంగం ముగించి వెళ్తున్న క్రమంలో తన కుమార్తెను జగ్గారెడ్డి పరిచయం చేశారు. తన కుమార్తె కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తుందని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..