AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మహాతల్లి.. ఫోన్ చూస్తూనే వెళ్లింది.. చివరకు దిమ్మతిరిగిపోయింది.. వైరల్ వీడియో..

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. స్కూల్ పిల్లల నుంచి పెద్దవారి వరకు గంటలు గంటలు సోషల్ మీడియాలో

Viral Video: మహాతల్లి.. ఫోన్ చూస్తూనే వెళ్లింది.. చివరకు దిమ్మతిరిగిపోయింది.. వైరల్ వీడియో..
Viral Video
Rajitha Chanti
|

Updated on: Mar 30, 2022 | 10:01 AM

Share

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. స్కూల్ పిల్లల నుంచి పెద్దవారి వరకు గంటలు గంటలు సోషల్ మీడియాలో మునిగితేలుతుంటారు. అరచేతిలో ఫోన్ ఉంటే లోకాన్నే మరచిపోతుంటారు. ఫోన్ చూస్తూ.. మాట్లాడుతూ ఏటు వెళ్తున్నాము.. ఏం చేస్తున్నాము అనే విషయాలను మర్చిపోతారు. ఇప్పుడు ప్రజలు ఎక్కువ సమయం గడిపుతున్నది నెట్టింట్లోనే. ఫోన్ అతిగా వాడడం అనేది ఆరోగ్యానికి ప్రమాదమని తెలిసినా.. ఫోన్ మాత్రం వదిలిపెట్టరు. ఫోన్ చూస్తూనే నడవడం.. ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వలన ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇప్పటికే ఫోన్ చూస్తూ నడవడం. డ్రైవ్ చేయడం వలన కలిగే నష్టాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఫోన్ చూస్తూ ఓ యువతి చేసిన పని చూస్తే మీరు షాకవుతారు.

ఓ సూపర్ మార్కెట్‏లో పనిచేసే యువతి ఫోన్ చూస్తూ అటు ఇటు తిరుగుతుంది. అయితే ఫోన్ చూస్తూ అలానే నడుస్తున్న సమయంలోనే పక్కనే ఉన్న బాస్కెట్‏లో కాలు పెట్టి నడిచింది. దీంతో ఒక్కసారిగా బొక్కా బోర్లా పడింది. పడిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఫోన్ చూస్తూనే పడుకునిపోయింది. కాసేపటి తర్వాత అటుగా ఓ వ్యక్తి రాడవంతో వెంటనే లేచి కూర్చుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Prabhas: మరోసారి హిట్ కాంబో రిపీట్.. ఆ సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క ?..

Jamun Benefits: నేరేడు పండుతో అద్భుతమైన ప్రయోజనాలు.. రక్తపోటు నుంచి మధుమేహం వరకు..

Ice Cream: వేసవిలో ఐస్‏క్రీంను ఎక్కువగా తినేస్తున్నారా ? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే.. ఎందుకంటే..

Summer Health: వేసవిలో గుడ్లను తింటున్నారా ? రోజుకు ఎన్ని తినాలో తెలుసా..