లావున్నోళ్లు స్వర్గానికెళ్లరా.. చూపుతా నా తడాఖా

లావు.. లావంటారు. లావుగా ఉంటే మనుషులు కారా..? సన్నగా, పీలగా ఉంటే మనుషులా.. అంటూ ఎగిరెగిరి పడింది ఓ స్థూల ‘సుందరి’. ఇంతకీ ఈమె దూకుడికి, కోపానికి కారణమేంటో తెలియాలంటే బ్రెజిల్‌లో జరిగిన ఓ ఉదంతంలోకి వెళ్లాల్సిందే. బ్రెజిల్ రాజధాని సావో పాలో ఉన్న కచొయిరా పౌలిస్తాలో ఇటీవల కొంతమంది మతగురువులు అక్కడకు వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ‘‘లావుగా ఉన్న వాళ్లు స్వర్గానికి వెళ్లడానికి అనర్హులంటూ’’ మార్కెలో రోసి అనే మతగురువు స్టేజ్‌ […]

లావున్నోళ్లు స్వర్గానికెళ్లరా.. చూపుతా నా తడాఖా
TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 22, 2019 | 12:07 PM

లావు.. లావంటారు. లావుగా ఉంటే మనుషులు కారా..? సన్నగా, పీలగా ఉంటే మనుషులా.. అంటూ ఎగిరెగిరి పడింది ఓ స్థూల ‘సుందరి’. ఇంతకీ ఈమె దూకుడికి, కోపానికి కారణమేంటో తెలియాలంటే బ్రెజిల్‌లో జరిగిన ఓ ఉదంతంలోకి వెళ్లాల్సిందే.

బ్రెజిల్ రాజధాని సావో పాలో ఉన్న కచొయిరా పౌలిస్తాలో ఇటీవల కొంతమంది మతగురువులు అక్కడకు వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ‘‘లావుగా ఉన్న వాళ్లు స్వర్గానికి వెళ్లడానికి అనర్హులంటూ’’ మార్కెలో రోసి అనే మతగురువు స్టేజ్‌ మీద చెబుతున్నాడు. వెంటనే కింద వరుసలో ఉన్న ఓ లావు పాటి మహిళ.. స్టేజ్ మీదకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఆ గురువును ఒక్క తోపు తోసింది. అంతే ఆ దెబ్బకు మత గురువు కిందకు పడిపోయాడు. వెంటనే అక్కడున్న సిబ్బంది ఆమెను పట్టుకునేందుకు రావడంతో.. ఆమె కూడా కిందకు దూకేసింది. అయితే ఈ ఘటనలో ఆ మతగురువుకు పెద్దగా గాయాలేం జరగలేదని.. కొద్ది సేపటికి తేరుకున్న ఆయన మళ్లీ వచ్చి తన ప్రసంగాన్ని పూర్తి చేశారని అక్కడి స్థానిక మీడియా తెలిపింది.

కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘ఇదంతా దేవుడి చర్య’’..‘‘అతడు స్వర్గాన్ని సురక్షితంగా చేరుకున్నాడా..?’’ .. ‘‘ఆమె రియల్ హీరో’’.. ‘‘అతడికిది కచ్ఛితమైన శిక్ష’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

https://twitter.com/zemunna/status/1151930998768226304?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1151930998768226304&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Ftrending-news%2Fstory%2Fwatch-woman-pushes-priest-off-stage-for-saying-fat-women-don-t-go-to-heaven-twitter-calls-her-hero-1571938-2019-07-21

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu