సిగరెట్‌తో ప్రియాంక.. చీదరిస్తున్న నెటిజన్లు

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ ఫేస్ చేస్తోంది. ప్రియాంక సిగరెట్ తాగుతూ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫ్లోరిడాలోని మయామిలో ప్రియా నిక్ జంట సిగరెట్లు కాల్చుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మధ్యలో ఆమె తల్లి మధు చోప్రా కూడా ఉన్నారు. వీళ్లందిరి చేతి వేళ్ల మధ్య సిగరెట్లు ఉన్నాయి. ఈ  ఫోటో చూసిన ఆమె అభిమానులతో పాటు  నెటిజన్స్ వీరి ప్రవర్తనపై పెదవి విరుస్తున్నారు. గతంలో తనకు […]

సిగరెట్‌తో ప్రియాంక.. చీదరిస్తున్న నెటిజన్లు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 22, 2019 | 2:38 AM

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ ఫేస్ చేస్తోంది. ప్రియాంక సిగరెట్ తాగుతూ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫ్లోరిడాలోని మయామిలో ప్రియా నిక్ జంట సిగరెట్లు కాల్చుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మధ్యలో ఆమె తల్లి మధు చోప్రా కూడా ఉన్నారు. వీళ్లందిరి చేతి వేళ్ల మధ్య సిగరెట్లు ఉన్నాయి. ఈ  ఫోటో చూసిన ఆమె అభిమానులతో పాటు  నెటిజన్స్ వీరి ప్రవర్తనపై పెదవి విరుస్తున్నారు. గతంలో తనకు ఆస్తమా వ్యాధి ఉండేదని, అది తన కలలకు అడ్డుగా నిలువలేదంటూ ఆ  వ్యాధితో  బాధపడే వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపిన ప్రియాంక.. ఇలా దూమపానం చేస్తూ కనిపించడంపై సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక తన భర్త నిక్ జోనస్‌తో కలిసి బర్త్‌డే సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తుంది.