కర్ణాటక బలపరీక్ష: ఓటింగ్ జరిగే ఛాన్స్ లేదు.. కేపీసీసీ చీఫ్ గుండూరావు
ఉత్కంఠగా సాగుతున్న కన్నడ రాజకీయంలో ఇవాళ మరోసారి బలపరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ పక్షాలు ఎవరికి వారే శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించాయి. అయితే బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సి వ్యూహాలపై ఇరుపార్టీలు చర్చించాయి కూడా. అయితే కాంగ్రెస్ పక్ష సమావేశం ముగిసిన తర్వాత కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం అసలు ఓటింగ్ జరిగే ఛాన్స్ లేదన్నారు. సుప్రీం కోర్టు నిర్ణయం కోసం తాము ఎదురుచూస్తున్నామన్నారు. ఇప్పటివరకు రాజీనామాలు చేసిన […]
ఉత్కంఠగా సాగుతున్న కన్నడ రాజకీయంలో ఇవాళ మరోసారి బలపరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ పక్షాలు ఎవరికి వారే శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించాయి. అయితే బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సి వ్యూహాలపై ఇరుపార్టీలు చర్చించాయి కూడా. అయితే కాంగ్రెస్ పక్ష సమావేశం ముగిసిన తర్వాత కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు షాకింగ్ కామెంట్స్ చేశారు.
సోమవారం అసలు ఓటింగ్ జరిగే ఛాన్స్ లేదన్నారు. సుప్రీం కోర్టు నిర్ణయం కోసం తాము ఎదురుచూస్తున్నామన్నారు. ఇప్పటివరకు రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు ససేమిరా అనడంపై ఆయన మాట్లాడుతూ వారంతా తర్వాత పశ్చాత్తాప పడతారని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే తాను అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరానని వస్తున్న వార్తలను సీఎం కుమారస్వామి ఖండించారు. సోమవారం జరిగే సభకు హాజరవుతానని కూడా ప్రకటించారు.
మరోవైపు కర్ణాటకలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బెంగళూరులోని రమద హోటల్‌లో బీజేపీ శాసనసభాపక్షం తాజా పరిణామాలపై చర్చించింది.