రాగల 36 గంటల్లో హైదరాబాద్‌కు వర్ష సూచన
చురుకుగా కదులుతున్న రుతుపవనాలతో రాగల 36గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఆదివారం ఉదయం నుంచి వాతావరణం చల్లబడినప్పటికీ మధ్యాహ్నం సమయానికి ఎంతతీవ్రత పెరిగింది. ఉదయం నుంచి 5.30 గంటల వరకు గరిష్ట ఉష్ణోగ్రత 31.6డిగ్రీలు,కనిష్ట ఉష్ణోగ్రత 22.3డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అలాగే గాలిలో తేమ 61 శాతంగా నమోదైనట్లు వాతావరణ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే వర్షాలు కురుస్తాయనే సమాచారంతో […]
చురుకుగా కదులుతున్న రుతుపవనాలతో రాగల 36గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఆదివారం ఉదయం నుంచి వాతావరణం చల్లబడినప్పటికీ మధ్యాహ్నం సమయానికి ఎంతతీవ్రత పెరిగింది. ఉదయం నుంచి 5.30 గంటల వరకు గరిష్ట ఉష్ణోగ్రత 31.6డిగ్రీలు,కనిష్ట ఉష్ణోగ్రత 22.3డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అలాగే గాలిలో తేమ 61 శాతంగా నమోదైనట్లు వాతావరణ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే వర్షాలు కురుస్తాయనే సమాచారంతో జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే సహాయక బృందాలను సిద్థం చేశారు. నాలాల పూడికలు, మ్యాన్‌హోల్స్ గుర్తించి వాటికి పైకప్పులు వేసే పనిలో నిమగ్నమయ్యారు.