షార్క్‌‌తో ‘క్లోజ్ ఎన్‌కౌంటర్’.. డేంజరే!

అమెరికాలోని మసాచ్యూసెట్స్ లో ఈ మధ్య ఓ విచిత్రం జరిగింది. అక్కడి సముద్ర జలాల్లోకి సరదాగా బోటులో షికారుకెళ్ళిన ఓ కుటుంబం తృటిలో ఒక షార్క్ దాడి నుంచి బయటపడింది. ఈ షాక్ నుంచి ఆ ఫ్యామిలీ ఇంకా బయటపడలేకపోతోంది. వివరాల్లోకి వెళ్తే.. నెల్సన్ అనే పెద్దమనిషి తన కొడుకు జాక్ తోను, ఇతర స్నేహితులతోను బోటులో ‘ సముద్ర విహారానికి ‘ వెళ్ళాడు. జాక్ తన చేతిలో ఓ చిన్న చేపను పట్టుకుని నీటి వంక […]

షార్క్‌‌తో 'క్లోజ్ ఎన్‌కౌంటర్'.. డేంజరే!
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Jul 22, 2019 | 4:10 PM

అమెరికాలోని మసాచ్యూసెట్స్ లో ఈ మధ్య ఓ విచిత్రం జరిగింది. అక్కడి సముద్ర జలాల్లోకి సరదాగా బోటులో షికారుకెళ్ళిన ఓ కుటుంబం తృటిలో ఒక షార్క్ దాడి నుంచి బయటపడింది. ఈ షాక్ నుంచి ఆ ఫ్యామిలీ ఇంకా బయటపడలేకపోతోంది. వివరాల్లోకి వెళ్తే.. నెల్సన్ అనే పెద్దమనిషి తన కొడుకు జాక్ తోను, ఇతర స్నేహితులతోను బోటులో ‘ సముద్ర విహారానికి ‘ వెళ్ళాడు. జాక్ తన చేతిలో ఓ చిన్న చేపను పట్టుకుని నీటి వంక చూస్తుండగా.. ఎప్పుడు..ఎలా చూసిందో.. ఓ వైట్ షార్క్ చరచరా దూసుకువచ్చి … నీటిలోంచే ఒక్క గంతున ఎగిరొచ్చి కుర్రాడి చేతిలోని చేపను నోట కరుచుకుని పోయింది. భయంతో జాక్ ఒక్క ఉదుటున వెనక్కివచ్చేశాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి ఆ ఫ్యామిలీకి సుమారు రెండు, మూడు నిముషాలు పట్టింది. ఈ వీడియో వైరల్ కాగా ఒక్కరోజులోనే 78 వేలకు పైగా వ్యూస్ రాబట్టింది. నెల్సన్ ఆ తరువాత ఈ ఘటనను.. ‘ భయం గొలిపే తమాషా ‘ అనుభవంగా అభివర్ణించాడు. ఏమైనా. గ్రేట్ వైట్ షార్క్ చేపలు చాలా డేంజరేనని, వాటి దాడిలో చాలామంది మరణించడమో, గాయపడడమో జరుగుతోందని అధికారులు, సముద్ర శాస్త్రజ్ఞులు అంటున్నారు. అందువల్లే అవి ఉంటున్న సముద్ర జల తీరాలకు సమీపంగా వెళ్లవద్దని సూచిస్తున్నారు.