AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiteboarding: చీరలో సముద్రంపై చేప పిల్లలా సందడి చేస్తోన్న యువతి.. భారత్‌లో కైట్ బోర్డింగ్‌కు ప్రాచుర్యం తీసుకురావమే లక్ష్యం అంటూ..

యోగా, వ్యాయామం, స్కూటర్ డ్రైవింగ్ వంటి సమయాల్లో కూడా చీరను ధరించి అలవోకగా ఆ పనులను చేసేస్తోంది. అయితే కొన్ని సందర్భాల్లో చీరతో నడవాలంటే ఇబ్బంది. అప్పుడు చీరని పైకి లాగి సర్దుకోవాలి. ఓ మహిళ చీరతో ఏకంగా సముద్రంపు అలలపై అలవోకగా తేలియాడుతూ కైట్ బోర్డింగ్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు.

Kiteboarding: చీరలో సముద్రంపై చేప పిల్లలా సందడి చేస్తోన్న యువతి.. భారత్‌లో కైట్ బోర్డింగ్‌కు ప్రాచుర్యం తీసుకురావమే లక్ష్యం అంటూ..
Woman Kiteboarding
Surya Kala
|

Updated on: Oct 09, 2023 | 12:54 PM

Share

ప్రపంచంలో భారతీయ మహిళలకు స్పెషల్ గుర్తింపుని తీసుకుని వచ్చింది. కట్టు బొట్టు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రోజూ సౌలభ్యం కోసం డ్రెస్స్, జీన్స్, మిడీస్ వంటివాటిని ధరించినా.. పండగలు, పర్వదినాలు, శుభ కార్యాల్లో ఆరు గజాల చీరను అలవోకగా కట్టుకుని మహిళలు సందడి చేయడం ఇప్పుడు సహజం. అయితే ఇప్పుడు కొందరు మహిళలు చీరకు స్పెషల్ ఐడెంటీని తీసుకుని వచ్చేందుకు  ప్రయత్నిస్తున్నట్లు .. యోగా, వ్యాయామం, స్కూటర్ డ్రైవింగ్ వంటి సమయాల్లో కూడా చీరను ధరించి అలవోకగా ఆ పనులను చేసేస్తోంది. అయితే కొన్ని సందర్భాల్లో చీరతో నడవాలంటే ఇబ్బంది. అప్పుడు చీరని పైకి లాగి సర్దుకోవాలి. ఓ మహిళ చీరతో ఏకంగా సముద్రంపు అలలపై అలవోకగా తేలియాడుతూ కైట్ బోర్డింగ్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు.

ఇది నిజంగా ఒక అద్భుతం అని కొందరు అన్నారు. నిజం చెప్పాలంటే ఇలా కైట్ బోర్డింగ్ చేసే సమయంలో ఎక్కువగా యువతులు పొట్టి దుస్తులు ధరిస్తారు.. చీర కట్టుకోవాల్సిన అవసరం లేదని ఎవరో చెప్పారు. కొంతమంది మహిళలు అత్యంత శక్తివంతులు అని కొనియాడారు. అయితే చీర కట్టుకున్నందుకు ఆ యువతిని పొగడాల్సిన అవసరం లేదు.. తాను చేస్తున్న పనికి తగిన విధంగా దుస్తులు ధరించి ఉంటే ప్రజలు ఇంత శ్రద్ధగా ఈ వీడియో చూసి ఉండేవారా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

చీరలో కాత్య సైని.. ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

View this post on Instagram

A post shared by Katya Saini (@katyasaini)

జూలై 10వ తేదీన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు 1.9 లక్షల మంది లైక్ చేశారు. వేలాది మంది ప్రజలు మిశ్రమంగా స్పందించారు. అంతకుముందు 104 ఏళ్ల వృద్ధురాలు స్కై డైవ్ చేసిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అలాగే 70 ఏళ్ల వృద్ధురాలు చీరలో స్కైడైవ్ చేసిందని కామెంట్ చేశారు.

ఇది పెద్ద విషయమా? ఇంటి పనిమనిషి కూడా ఇలా ఎగరగలేదని ఒకరు కామెంట్ చేయగా.. ఈ కామెంట్ పై స్పందిస్తూ.. స్త్రీల పట్ల గౌరవంగా ఉండండని సూచించారు. భారతీయ మహిళలు కుటుంబ బాధ్యతలే కాకుండా తమ అభిరుచికి అనుగుణంగా తమ పనులు తాము చేసుకోవడం అంత సులభం కాదని మరొకరు అన్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో మహిళ కైట్, డైవ్ శిక్షకురాలు. వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ లు న్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..