AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: 31 కోడిగుడ్ల ఆమ్లెట్ తినండి, లక్ష రూపాయల గిఫ్ట్ తీసుకోండి.. ఛాలెంజ్ వైరల్

ఒక షాప్ యజమాని ఒక పాత్రలో 31 గుడ్లను ఒక్కొక్కటిగా పగలగొట్టి ఆమ్లెట్ తయారు చేయడానికి రెడీ అయ్యాడు. ముందుగా బాణలిలో చాలా వెన్న వేసి ఆ తర్వాత ఉల్లిపాయలు, మిరపకాయలు, టమాటాలు వేశాడు. అనంతరం తాను పగల గొట్టిన మొత్తం 31 గుడ్లు వేసి బ్రెడ్ వేసి బాగా వేయించాడు. అనంతరం ఒక ప్లేట్ లోకి తీసి.. వీటిని ఉల్లిపాయలు, క్యారెట్ , కొత్తిమీర వంటి వాటితో అలంకరించాడు. ఈ బ్రెడ్ ఆమ్లెట్ ను  ఎవరు తింటే వారికి లక్ష రూపాయల రివార్డు ఇస్తానని ఛాలెంజ్ చేశాడు.

Viral News: 31 కోడిగుడ్ల ఆమ్లెట్ తినండి, లక్ష రూపాయల గిఫ్ట్ తీసుకోండి.. ఛాలెంజ్ వైరల్
Unique Food Challenge
Surya Kala
|

Updated on: Oct 09, 2023 | 12:15 PM

Share

ప్రపంచంలో వెజ్‌తో పాటు నాన్‌వెజ్‌ తినేవాళ్లు కూడా ఎక్కువే.  నాన్ వెజ్ ప్రియుల్లో కొందరు చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు వంటి అనేక రకాలను తింటే.. కొందరు కేవలం కోడిగుడ్లు మాత్రమే తింటారు. ఇంకా చెప్పాలంటే చాలా మంది శాకాహారులు కూడా గుడ్లను తింటారు. ఎంత ఇష్టమైనా సరే ఒక వ్యక్తి రోజుకు 2-3 గుడ్లు మాత్రమే తినగలడు. అదే జిమ్ చేసే వ్యక్తులు 6-7 తింటారు. వ్యాయామం చేస్తూ కండలను పెంచే వారు ఎంత ఎక్కువగా గుడ్లను తిన్నా సుమారు 10 గుడ్లు తింటారేమో.. అయితే ఒకేసారి 20-30 గుడ్లు తినమని అడిగితే..  మీరు అలా చేయగలరా? అవును.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఛాలెంజ్ వైరల్ అవుతోంది. ఈ ఛాలెంజ్ తెలుసుకున్న ప్రజలు షాక్ అవుతున్నారు.

ఒక దుకాణదారుడు 31 గుడ్లతో చేసిన ఆమ్లెట్ తినమని ప్రజలకు ఛాలెంజ్ విసిరాడు. ఈ ఛాలెంజ్‌ను పూర్తి చేసిన వారికి అంటే 31 గుడ్లతో చేసిన ఆమ్లెట్‌ను తిన్నవారికి 1 లక్ష బహుమతిగా ఇస్తామని ప్రకటించాడు. ఈ ప్రత్యేకమైన ఛాలెంజ్ ను ఢిల్లీలోని ఒక స్ట్రీట్ ఫుడ్ దుకాణదారుడు విసిరాడు. అతని పేరు రాజీవ్ అని  తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

ఒక షాప్ యజమాని ఒక పాత్రలో 31 గుడ్లను ఒక్కొక్కటిగా పగలగొట్టి ఆమ్లెట్ తయారు చేయడానికి రెడీ అయ్యాడు. ముందుగా బాణలిలో చాలా వెన్న వేసి ఆ తర్వాత ఉల్లిపాయలు, మిరపకాయలు, టమాటాలు వేశాడు. అనంతరం తాను పగల గొట్టిన మొత్తం 31 గుడ్లు వేసి బ్రెడ్ వేసి బాగా వేయించాడు. అనంతరం ఒక ప్లేట్ లోకి తీసి.. వీటిని ఉల్లిపాయలు, క్యారెట్ , కొత్తిమీర వంటి వాటితో అలంకరించాడు. ఈ బ్రెడ్ ఆమ్లెట్ ను  ఎవరు తింటే వారికి లక్ష రూపాయల రివార్డు ఇస్తానని ఛాలెంజ్ చేశాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది food_founder అనే IDతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇది ఇప్పటివరకు 4 లక్షల 80 వేల కంటే ఎక్కువ సార్లు వ్యూస్ ను సొంతం చేసుకుంది. 15 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు.

అదే సమయంలో వీడియో చూసిన తర్వాత, ప్రజలు కూడా వివిధ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఈ ఆమ్లెట్‌ తిని నేరుగా డాక్టర్‌ దగ్గరకు వెళ్లండి’ అని ఓ యూజర్‌ రాయగా, మరో యూజర్‌ కూడా ఇదే తరహాలో ‘ఇది తిన్నాక  గిఫ్ట్ గా తీసుకునే లక్ష రూపాయలతో ఆస్పత్రిలో వైద్యం చేయించుకోలేరని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..