Viral News: ఏం పెళ్లాంరా బాబు.. కుర్ కురే కొనివ్వ‌లేద‌ని భర్తను ఏం చేసిందో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..!

గత సంవత్సరం 2023లో ఈ దంపతులకు వివాహం జరిగిందని చెప్పాడు. ఈ జంట కేవలం ఒక సంవత్సరంలోనే విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు. భర్త కొట్టాడని భార్య చెబితే, ఎందుకని ఆరా తీయగా,5 రూపాయల కుర్కురే కోసం భార్య గొడవ పడింది. కుర్కురే కొనిపించకపోవటంతో పుట్టింటికి వెళ్లిపోయిందని భర్త చెప్పాడు. అయితే, ప్రస్తుతం వీరి విడాకుల కేసు వాయిదా పడింది. తర్వాతి తేదీన

Viral News: ఏం పెళ్లాంరా బాబు.. కుర్ కురే కొనివ్వ‌లేద‌ని భర్తను ఏం చేసిందో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..!
Kurkure Packet
Follow us
Jyothi Gadda

|

Updated on: May 15, 2024 | 4:04 PM

కేవలం ఐదు రూపాయల కుర్కురే విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరి వివాహబంధాన్ని విచ్ఛిన్నం చేసే స్థాయికి చేరుకుంది. భార్యకు భర్త క్రిస్ప్స్ ప్యాకెట్ తీసుకురాకపోవడంతో ఆగ్రహించిన భార్య అత్తమామలను వదిలి నేరుగా ఇంటికి వెళ్లిపోయింది. విషయం ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కు చేరింది. కౌన్సెలింగ్ సెంటర్‌లో ఇద్దరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని షాగంజ్‌లో వెలుగు చూసింది. భర్త కుర్కూర్‌లు తీసుకురాకపోవడంతో విడాకులు ఇవ్వాలని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన ఈ వింత ఘటనలో 5 రూపాయల విలువైన కుర్కురే చిప్స్ తీసుకురాలేదని ఓ మహిళ తన భర్తపై పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. విడాకుల వరకు వెళ్లింది. సదరు మహిళ గత ఒకటిన్నర నెలలుగా తన తల్లి ఇంట్లోనే ఉంటోంది. ఇటీవల ఆమె తన భర్తపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. మహిళ ఫిర్యాదును ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెల్‌కు బదిలీ చేసి, భార్యాభర్తలను సెల్‌కి పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.

భార్యాభర్తలిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చిన డాక్టర్ సతీష్ ఖీర్వారా మాట్లాడుతూ,..గత సంవత్సరం 2023లో ఈ దంపతులకు వివాహం జరిగిందని చెప్పాడు. ఈ జంట కేవలం ఒక సంవత్సరంలోనే విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు. భర్త కొట్టాడని భార్య చెబితే, ఎందుకని ఆరా తీయగా,5 రూపాయల కుర్కురే కోసం భార్య గొడవ పడింది. కుర్కురే కొనిపించకపోవటంతో పుట్టింటికి వెళ్లిపోయిందని భర్త చెప్పాడు. అయితే, ప్రస్తుతం వీరి విడాకుల కేసు వాయిదా పడింది. తర్వాతి తేదీన ఇద్దరి మధ్య రాజీ కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..