Watch Video: పాముకు దహన సంస్కారాలు.. మనుషుల మాదిరే పూజాది కార్యక్రమాలు, ఊరేగింపు
గతంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై సంచరిస్తున్న పాము చనిపోతే దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు ఆ పాముకు దహన సంస్కారాలు చేశారు. అయితే, ఇప్పుడు అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో తాచు పాము చనిపోవటంతో గ్రామస్తులంతా కలిసి దహన సంస్కారాలు నిర్వహించారు.
హిందూ సంప్రదాయంలో అంత్యక్రియలు కూడా వేడుకగా నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో మనుషులకు మాత్రమే కాదు.. మూగజీవాలు చనిపోయినా కూడా ప్రజలు వాటికి అంత్యక్రియలు చేస్తారు. ఆధ్యాత్మిక ప్రాంతాల్లో సంచరించేవి ఏవి మరణించినా వాటికి శాస్త్రోక్తంగా దహన సంస్కారాలు నిర్వహిస్తారు. గతంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై సంచరిస్తున్న పాము చనిపోతే దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు ఆ పాముకు దహన సంస్కారాలు చేశారు. అయితే, ఇప్పుడు అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో తాచు పాము చనిపోవటంతో గ్రామస్తులంతా కలిసి దహన సంస్కారాలు నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో చోటు చేసుకుంది ఈ ఘటన. పేరుపాలెం సౌత్ పంచాయతీ పరిధిలోని మేళంవారిమెరకలో చనిపోయిన ఓ పాముకు దహన సంస్కారాలు చేశారు. ఇళ్ల పరిసరాల్లో తాచు పాము చనిపోయి ఉండగా.. గమనించిన స్థానికులు దాన్ని దేవుడి పాముగా భావిస్తూ అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం పాడెపై ఊరేగించి దహన సంస్కారాలు పూర్తి చేశారు.