AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతి నీటి చుక్కా అమృతమే.. కోతికి ఉన్న సృహ నేటి మానవులకు కరవు.. వీడియో వైరల్

చిన్నతనంలో 'నీరే ప్రాణం' అని పుస్తకాల్లో చదివి ఉంటారు. నీరు లేకుండా మానవులు లేదా ఏ జీవి ఉనికి సాధ్యం కాదు. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అయినప్పటికీ చాలా మంది ఆలోచించకుండా నీటిని వృధా చేస్తారు. నీటి ప్రాముఖ్యత, మానవ జీవితానికి ఎంత ముఖ్యమో అసలు గుర్తించరు. అయితే ఈ కోతికి నీటి విలువ తెలుసు. రోడ్డుపక్కన అమర్చిన కుళాయిలోంచి నీటిని తాగుతున్న కోతి ఆ నీటిని తాగగానే కుళాయి నుంచి నీరు వృధా పోకుండా టాప్ ను సరిగ్గా మూసేసింది. 

ప్రతి నీటి చుక్కా అమృతమే.. కోతికి ఉన్న సృహ నేటి మానవులకు కరవు.. వీడియో వైరల్
Viral Video
Surya Kala
|

Updated on: May 15, 2024 | 4:05 PM

Share

మానవులు ఈ భూమిపై అత్యంత తెలివైన జీవులుగా పరిగణించబడుతున్నప్పటికీ.. కొన్నిసార్లు కొన్ని జంతువుల తెలివితేటలు , సామజిక సృహ చూస్తే మనుషులు వీటి ముందు ఎందుకు పనికి వస్తారు అని పిస్తుంది కూడా.. కొన్ని జంతువులు చేసే పనులు చూసిన తర్వాత ప్రజలు కూడా గందరగోళానికి గురవుతారు. ప్రస్తుతం, అటువంటి జంతువు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఖచ్చితంగా ఎవరి  హృదయానికి అయినా సంతోషాన్ని ఇస్తుంది. వాస్తవానికి ఈ వీడియో ఒక కోతికి సంబంధించినది. ఆ కోతి  కుళాయిని తెరిచి నీరు త్రాగుతూ కనిపించింది. దీని నుంచి మనుషులు కూడా నేర్చుకోవాలి.

చిన్నతనంలో ‘నీరే ప్రాణం’ అని పుస్తకాల్లో చదివి ఉంటారు. నీరు లేకుండా మానవులు లేదా ఏ జీవి ఉనికి సాధ్యం కాదు. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అయినప్పటికీ చాలా మంది ఆలోచించకుండా నీటిని వృధా చేస్తారు. నీటి ప్రాముఖ్యత, మానవ జీవితానికి ఎంత ముఖ్యమో అసలు గుర్తించరు. అయితే ఈ కోతికి నీటి విలువ తెలుసు. రోడ్డుపక్కన అమర్చిన కుళాయిలోంచి నీటిని తాగుతున్న కోతి ఆ నీటిని తాగగానే కుళాయి నుంచి నీరు వృధా పోకుండా టాప్ ను సరిగ్గా మూసేసింది.  నీరు వృథా కాకుండా కోతి చేసిన పని వీడియోలో చూడవచ్చు. కోతి తెలివితేటలు ప్రజలను ఆశ్చర్యపరిచాయి. ఆనందపరిచాయి.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

ఈ హృదయాన్ని హత్తుకునే వీడియోను జార్ఖండ్ డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ‘విద్యా సందేశం’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు ఈ వీడియోకు. ప్రతి నీటి బొట్టు అమూల్యమైనది. దానిని వృధా చేయవద్దు. కేవలం 11 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 13 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు.

అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఒకరు ‘నీరు అంటే ప్రాణం.. ఈ విషయాన్నీ మనుషుల కంటే జంతువులే ఎక్కువగా అర్థం చేసుకున్నట్లు ఉన్నాయి ‘ అని రాశారు, మరొక వినియోగదారు ‘జంతువులకు సామజిక సృహ, ప్రకృతి పరిరక్షణ ఎక్కువ. మానవులు మాత్రం ఈ విషయాన్నీ అర్థం చేసుకోరు’ అని రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?