కోరిన కోర్కెలు తీరాలంటే మోహిని ఏకాదశి రోజున ఏ వస్తువులు దానం చేయాలంటే
ఎవరైనా మోహినీ ఏకాదశి వ్రతాన్ని చేయవచ్చు. అంతేకాదు ఆ రోజున శక్తి మేరకు దానం చేయవచ్చు. అవసరంలో ఉన్న వ్యక్తికి విరాళం ఇవ్వవచ్చు. దానం చేసేటప్పుడు.. దానం చేసిన వస్తువుల స్వచ్ఛతను గుర్తుంచుకోండి. అలాగే దానధర్మాలు పుణ్యం పొందడానికే కాదు.. పేదవారికి సహాయం చేయడం కోసం అని కూడా గుర్తుంచుకోవాలి. ఏకాదశి ఉపవాసం దానం చేసిన తర్వాత మాత్రమే సంపూర్ణంగా పరిగణించబడుతుంది.
హిందూ మతంలో ఏకాదశి తిథికి విశిష్ట స్థానం ఉంది. వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని పదకొండవ రోజున ఏకాదశి తిధిని మోహిని ఏకాదశిగా జరుపుకోనున్నారు. ఈ రోజున మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. అంతేకాదు మోహిని ఏకాదశి రోజున చేసే దానధర్మాలకు విశిష్టస్థానం ఉంది. మోహినీ ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలతో విష్ణువు అనుగ్రహం లభిస్తుందని.. భక్తులందరికీ పుణ్య ఫలితాలు లభిస్తాయని కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. మోహినీ ఏకాదశి రోజున దానం చేయడం వల్ల పుణ్యం పొందడమే కాదు జీవితంలో కష్టాలు తొలగి.. సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం.
ఎవరైనా మోహినీ ఏకాదశి వ్రతాన్ని చేయవచ్చు. అంతేకాదు ఆ రోజున శక్తి మేరకు దానం చేయవచ్చు. అవసరంలో ఉన్న వ్యక్తికి విరాళం ఇవ్వవచ్చు. దానం చేసేటప్పుడు.. దానం చేసిన వస్తువుల స్వచ్ఛతను గుర్తుంచుకోండి. అలాగే దానధర్మాలు పుణ్యం పొందడానికే కాదు.. పేదవారికి సహాయం చేయడం కోసం అని కూడా గుర్తుంచుకోవాలి. ఏకాదశి ఉపవాసం దానం చేసిన తర్వాత మాత్రమే సంపూర్ణంగా పరిగణించబడుతుంది.
పంచాంగం ప్రకారం ప్రజలు మోహినీ ఏకాదశి వ్రతం, పూజా విధానం, పారణ సమయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సంవత్సరం 2024లో మోహినీ ఏకాదశి ఆదివారం, మే 19న సూర్యోదయంతో ప్రారంభమై, మరుసటి రోజు మే 20న సూర్యోదయం తర్వాత ముగుస్తుంది. ద్వాదశి నాడు ఉపవాస దీక్ష విరమించే సమయం మధ్యాహ్నం 3:17 వరకు.
ఏ వస్తువులను దానం చేయవచ్చంటే
ధాన్యం: గోధుమలు, బియ్యం, పప్పులు, శనగలు మొదలైనవి.
పండ్లు: అరటి, ఆపిల్, నారింజ, ద్రాక్ష మొదలైనవి
బట్టలు: పసుపు బట్టలు
డబ్బు: దాతృత్వానికి డబ్బు
రాగి: రాగి సామాను
నెయ్యి: స్వచ్ఛమైన నెయ్యి
దుప్పటి: నిరు పేదలకు
మందులు: అవసరం ఉన్నావారికి, పేదలకు మందులు
ఎలా దానం చేయాలంటే
పురాణ శాస్త్రాల ప్రకారం దానం చేసే ముందు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. ముందుగా దానం చేసే వస్తువులను విష్ణుమూర్తికి సమర్పించండి. ఆ తర్వాత దానం చేయం. అంతేకాదు మీరు ఇచ్చిన వస్తువులను తీసుకున్న వ్యక్తిని గౌరవించండి. దానం చేసిన తర్వాత మనస్సులో మంచి ఆలోచనలు మాత్రమే చేయండి. మోహినీ ఏకాదశి నాడు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు దానం చేయడం ద్వారా గ్రహాల స్థానాలు మంచిగా ఉంటాయి. సిరి సంపదలను పొందుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు