ధైర్యముంటేనే చూడండి.. నిద్రిస్తున్న బాలుడి పక్కన తేలుతూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా..!

కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ల ఆత్మలు కొన్ని భూమి మీద సంచరిస్తుంటాయని కొందరు చెబుతుంటారు. అయితే ఇదంతా అవాస్తవమని సైన్స్ చెబితే.. కొంతమంది పెద్దలు మాత్రం ఇది నిజమేనని వారి వాదన చెబుతుంటారు. ఏది ఏమైనప్పటికీ.. దెయ్యం కాన్సెప్ట్ అన్నది మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ సృష్టిస్తోంది.

ధైర్యముంటేనే చూడండి.. నిద్రిస్తున్న బాలుడి పక్కన తేలుతూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా..!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: May 15, 2024 | 3:35 PM

కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ల ఆత్మలు కొన్ని భూమి మీద సంచరిస్తుంటాయని కొందరు చెబుతుంటారు. అయితే ఇదంతా అవాస్తవమని సైన్స్ చెబితే.. కొంతమంది పెద్దలు మాత్రం ఇది నిజమేనని వారి వాదన చెబుతుంటారు. ఏది ఏమైనప్పటికీ.. దెయ్యం కాన్సెప్ట్ అన్నది మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ సృష్టిస్తోంది. అప్పుడప్పుడూ దెయ్యాలు ఉన్నాయంటూ వైరల్ అయ్యే కొన్ని వీడియోలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. అలాంటి ఓ వీడియోనే ఇప్పుడు చూద్దాం. ఇది అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జాన్‌ కప్కీ అనే వ్యక్తి మిషిగన్‌లోని తన 100 ఏళ్ల నాటి పురాతన ఇంటిలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఇటీవల ఓ షాకింగ్ దృశ్యాన్ని సీసీటీవీ ఫుటేజ్‌లో చూశాడు. గదిలో నిద్రిస్తున్న అతడి కొడుకు పక్కన ఓ వింత ఆకారం గాలిలో తేలుతూ కనిపించింది. ఈ దృశ్యం కెమెరాలకు చిక్కింది. మొదట ఈ విషయం జాన్‌కు ఏమాత్రం అంతుచిక్కలేదు. అయితే ఆ తర్వాత కాస్త పరిశీలనగా ఆ ఫుటేజ్ చూస్తే ఆ ఆకారం టోపీ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా అతడు షాక్ అయ్యాడు. అతడి తండ్రి కూడా టోపీ పెట్టుకునేవాడని.. తన కొడుకు పక్కన కనిపించిన ఆ వింత ఆకారం తన తండ్రి ఆత్మ అయ్యి ఉంటుందని అనుకున్నాడు. ఇక ఇలాంటి ఆలోచన తన మైండ్‌లోకి రాగానే ఒకింత కలవరానికి గురయ్యాడు జాన్. ఈ అంశాన్ని నెటిజన్లతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ వార్త క్షణాల్లో వైరల్‌గా మారగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తించారు.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే