AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పాము లాంటి నోరు… నీలి రంగు నాలిక.. సృష్టిలో వింత జీవి.. వీడియో వైరల్

రోజూ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఆ వీడియోల్లో అద్భుతమైన జీవుల వీడియోలను చూస్తుంటాము. ఈ రోజుల్లో అలాంటి ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో అడవి మధ్యలో చాలా వింతైన జీవి కనిపిస్తుంది. పాము లాంటి ముఖం, చిన్న తోక, నీలి రంగు నాలుక కలిగిన ఈ వింత జీవి నిజంగా.. ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది.

Viral Video: పాము లాంటి నోరు... నీలి రంగు నాలిక.. సృష్టిలో వింత జీవి.. వీడియో వైరల్
Blue Tongued Skink
Surya Kala
|

Updated on: Sep 18, 2025 | 12:43 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులలో లెక్కలేనన్ని జాతుల జంతువులు ఉన్నాయి. వాటిలో క్రూర మృగాలు ఉన్నాయి. సాధు జీవులున్నాయి. వీటిల్లో చాలా జీవుల గురించి మనకు తెలుసు. అలాగే చూడగానే చాలా వింత జీవిగా అనిపించే అనేక జాతులు కూడా ఉన్నాయి. అలాంటి ఒక వింతగా కనిపించే జీవికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జీవికి పాము లాంటి నోరు, చాలా చిన్న తోక ముఖ్యంగా, ఈ జీవి నాలుక నీలం రంగులో ఉంది. వీడియో కనిపించిన జీవిని చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. అసలు ఈ జీవి ఎలాంటిది అని ఆలోచిస్తూ.. దాని లక్షణాలను ఊహించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ వీడియోలో అడవిలో ఎండిన ఆకులపై కూర్చున్న ఒక వింత జీవిని మీరు చూడవచ్చు. దీని నోరు పాము నోరును పోలి ఉంది. అయితే దీని శరీర నిర్మాణం బల్లిని పోలి ఉంది. అప్పుడు కెమెరాను ఆ జీవికి దగ్గరగా తీసుకెళ్తుంటే.. అది అకస్మాత్తుగా తన నీలిరంగు నాలుకను బయటకు తీసింది. సోషల్ మీడియా వినియోగదారులు ఈ క్షణం చూసి ఆశ్చర్యపోతున్నారు. కొందరు దీనిని పాములో ఒక రకం అని అంటున్నారు. మరికొందరు ఇది అరుదైన బల్లి జాతి కావచ్చునని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

వేగంగా వైరల్ అవుతోన్న వీడియో

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @TheeDarkCircle అనే యూజర్‌నేమ్‌తో షేర్ చేశారు. ఈ 16 సెకన్ల వీడియోను ఇప్పటికే 40,000 వ్యూస్ సొంతం చేసుకోగా.. వందలాది మంది దీన్ని లైక్ చేసి వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. దీనిని రాత్రి సమయంలో చూస్తే.. గుండెపోటు తప్పదని ఫన్నీగా కామెంట్ చేయగా.. మరొకరు ప్రకృతిలో చాలా అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయి, వాటిని చూసిన తర్వాత కూడా నమ్మడం కష్టం’ అని అన్నారు.

ఈ వింత జీవి ఏమిటి?

నివేదికల ప్రకారం ఈ వింతగా కనిపించే జీవి బ్లూ-టాంగ్యుడ్ స్కింక్ అని పిలువబడే బల్లి. ఇది ఆస్ట్రేలియా, ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. దీని అత్యంత విలక్షణమైన లక్షణం దాని ప్రకాశవంతమైన నీలం నాలుక. ఇది ప్రమాదాన్ని గ్రహించినప్పుడు శత్రువులను భయపెట్టడానికి నాలికని ఉపయోగిస్తుంది. దూరం నుంచి చూస్తే పామును పోలి ఉంటుంది.. వాస్తవానికి ఇది ఒక రకమైన బల్లి. దీనికి చిన్న తోక, బరువైన శరీరం ఉంటుంది.

వీడియోను ఇక్కడ చూడండి

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..