Viral Video: అత్యంత ప్రమాదకరమైన రక్తపింజర పామును భలే పట్టుకున్నాడుగా.. వీడియో చూసేయండి!
గత కొద్దిరోజులుగా కోనసీమలోని అయినవల్లిలో ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాము రక్తపింజర తిష్ట వేసింది. దాన్ని ఓ స్నేక్ క్యాచర్ ఎలా పట్టుకున్నాడో చూసేయండి..
అత్యంత ప్రమాదకరమైన రక్తపింజర పామును ఓ స్నేక్ క్యాచర్ చాలా చాకచక్యంగా పట్టుకున్నాడు. కోనసీమలోని అయినవిల్లి మండలం క్రాపలో గత కొద్దిరోజులుగా రక్తపింజర పాము తిష్ట వేసింది. స్థానిక ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది. ఇదిలా ఉంటే.. రెండు రోజుల కిందట కొంతమంది కొబ్బరి వర్తకులు పొలంలో దింపు తీస్తుండగా.. వారికి వింత శబ్దాలు వినిపించాయి. వాటిని మొదట పట్టించుకోలేదు. అయితే అవి క్రమేపీ పెద్దగా వస్తుండటంతో.. ఎక్కడ నుంచి వస్తున్నాయా అని చూడగా.. వారందరికీ కొబ్బరి ఆకుల కింద రక్తపింజర పాము కనిపించింది. దీనితో ఆ కొబ్బరి వర్తకులు దెబ్బకు దడుసుకున్నారు. వెంటనే స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే స్పాట్‌కు చేరుకున్న అతడు.. కొబ్బరి ఆకులు కింద దాక్కున్న రక్తపింజర పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. అనంతరం ఓ గోనె సంచిలో బంధించి ఫారెస్ట్ సిబ్బందికి అప్పగించాడు. దీనితో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉంటే.. రక్తపింజర (రసైల్ వైపర్) ప్రపంచంలోని ప్రమాదకరమైన పాములలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది భారతదేశంలో కూడా కనిపిస్తుంది. భారతదేశంలో లభించే పాములు చాలా ప్రమాదకరమైనవి. ఈ పాము విషం చాలా ప్రమాదకరమైనది. ఒక వ్యక్తి రక్తపింజరి కరిచినట్లయితే ఆ వ్యక్తి రక్తంలో క్షణాల్లో గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. చాలా అవయవాలు పని చేయడం కోల్పోతాయి.