Watch Video: సర్కారీ బస్సు సర్కస్‌ చూస్తే అవాక్కే..! టాప్‌ లేచిపోయింది.. వైరలవుతున్న వీడియో

బస్సు ముందు నుంచి వెళ్తున్న ఓ బాటసారి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో వైరల్‌గా మారింది. దాంతో సంబంధిత అధికారులు స్పందించారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఓ అధికారిని సస్పెండ్‌ చేశారు. ఈ సంఘటన జూలై 26 బుధవారం నాటిదని తెలిసింది. అయితే, పైకప్పు బయటి అల్యూమినియం భాగం, లోపలి లైనింగ్ బాగానే ఉన్నాయి. దీంతో పైకప్పు విరిగిపోయిన విషయం బస్సు డ్రైవర్‌, ప్రయాణికులకు తెలియలేదు.

Watch Video: సర్కారీ బస్సు సర్కస్‌ చూస్తే అవాక్కే..! టాప్‌ లేచిపోయింది.. వైరలవుతున్న వీడియో
Msrtc Bus
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 31, 2023 | 8:03 PM

‘ప్రభుత్వ బస్సు’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన జనం షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ బస్సు విరిగిన పైకప్పుతో రోడ్డుపై దూసుకుపోతూ కనిపిస్తుంది. ఈ విచిత్ర సంఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతానికి సంబంధించినది. రోడ్డుపై ఓ బస్సు వేగంగా వెళ్తుండగా, దాని పైకప్పు ఒకవైపు నుంచి లేచి గాలిలో ఎగురుతుండడం వైరల్ వీడియోలో కనిపిస్తోంది. బస్సు, కండక్టర్, ప్రయాణికుల గురించి ఎలాంటి సమాచారం లేదని తెలిసింది. అయితే ఈ వీడియో వైరల్‌గా మారడంతో అసలు విషయం బయటపడింది. ఇంకేముంది సోషల్ మీడియాలో వీడియో చూసిన నెటిజన్లు..బస్సుల కండీషన్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ సరదాగా వ్యాఖ్యలు కూడా చేశారు. ఉదాహరణకు, ఇది సన్‌రూఫ్ బస్సు అని కొందరు, ఎయిర్ కండిషన్డ్ బస్సు అని మరికొందరు అన్నారు.

Msrtc Bus 1

Msrtc Bus

నివేదిక ప్రకారం, ఈ కేసు మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందినది. ఇక్కడ ‘మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్’ (MSRTC) బస్సు సగం పైకప్పు తెరుచుకుంది. అయినా డ్రైవర్ బస్సును నడుపుతూనే ఉన్నాడు. బస్సు ముందు నుంచి వెళ్తున్న ఓ బాటసారి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో వైరల్‌గా మారింది. దాంతో సంబంధిత అధికారులు స్పందించారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ఓ అధికారిని సస్పెండ్‌ చేశారు. ఈ సంఘటన జూలై 26 బుధవారం నాటిదని తెలిసింది.

ఇవి కూడా చదవండి

ఈ విషయంపై MSRTC మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ శేఖర్ చన్నె మాట్లాడుతూ.. ఈ బస్సు గడ్చిరోలి-అహేరి మార్గంలో తిరుగుతుంది . డ్రైవర్ క్యాబ్ పైన ఉన్న ఔటర్ ఫైబర్ కొద్దిగా విరిగిపోయింది. అయితే, పైకప్పు బయటి అల్యూమినియం భాగం, లోపలి లైనింగ్ బాగానే ఉన్నాయి. దీంతో పైకప్పు విరిగిపోయిన విషయం బస్సు డ్రైవర్‌, ప్రయాణికులకు తెలియలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..