ప్రియుడి కోసం బ్రిటన్ నుంచి పాకిస్థాన్‌కు వచ్చిన మహిళ! బందోబస్తుకు వెళ్లిన పోలీసులకు కళ్లు తిరిగే షాక్..

బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ తన ప్రేమ కోసం పాకిస్థాన్‌కు వచ్చిందని పాకిస్థాన్‌కు చెందిన ఖైబర్ పఖ్తుంఖ్వాకు చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు, అయితే బందోబస్తు కోసం పోలీసులకు అసలు విషయం తెలిసి కంగుతిన్నారు. ఖాకీలకే దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన మహ్మద్ గులాబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో వార్త చర్చనీయాంశంగా మారింది.

ప్రియుడి కోసం బ్రిటన్ నుంచి పాకిస్థాన్‌కు వచ్చిన మహిళ! బందోబస్తుకు వెళ్లిన పోలీసులకు కళ్లు తిరిగే షాక్..
Snapchat Love
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 31, 2023 | 9:08 AM

భారత్‌ నుంచి పాకిస్థాన్‌ వరకు ఈ రోజుల్లో ప్రేమకథలు చర్చనీయాంశమయ్యాయి. మొదట సీమ హైదర్, ఇప్పుడు అంజు ఇద్దరూ తమ ప్రేమ కోసం హద్దులు దాటారు. అయితే తాజాగా మరో ప్రేమకథ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇక్కడ మరో మహిళ తన ప్రియుడితో కలిసి ఉండేందుకు విదేశాల నుంచి పాకిస్థాన్‌ వచ్చిందని పోస్ట్ చేసింది. ఈ మేరకు పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వాకు చెందిన ఓ వ్యక్తిపై ఫేక్ సోషల్ మీడియా పోస్ట్‌లు పెట్టినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ వాదనలో వాస్తవం లేదని తేలింది.

పాకిస్థానీ వార్తా వెబ్‌సైట్ వార్తల ప్రకారం.. ముహమ్మద్ గులాబ్ ఇలా అనే బ్రిటీష్ మహిళ తన ప్రియుడితో కలిసి ఉండేందుకు సలార్జాయ్‌కు వచ్చిందని సోషల్ మీడియా క్లెయిమ్‌ను పోస్ట్ చేశాడు. అయితే ఆ పోస్ట్‌ను చూసిన పోలీసులు మహిళకు భద్రత కల్పించేందుకు రంగంలోకి దిగడంతో ఇదంతా ఫేక్ అని తెలిసింది. పోలీసులు హడావుడిగా పేర్కొన్న చిరునామాకు చేరుకోగా అక్కడ ఎవరూ కనిపించలేదు. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి వెంటనే మహ్మద్ గులాబ్‌ను అరెస్ట్ చేశారు. అరెస్టుపై స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు తమ సీనియర్ల ఆమోదం తర్వాతే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సోషల్ మీడియాలో అనేక ఫేక్‌ న్యూస్‌ వస్తుంటాయి. కాబట్టి ముందుగా స్థానిక ప్రతినిధులను సంప్రదించాలని స్థానికులు తెలిపారు.

భారత్‌, పాకిస్థాన్‌లలో ఇలాంటి కేసులు తెరపైకి వస్తున్న తరుణంలో ఈ పోస్ట్ కూడా వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం