Skydiving Wedding: వార్నీ ఇదేం పిచ్చిరా సామీ..ఎత్తైన కొండపై నుండి స్కైడైవింగ్ చేస్తూ పెళ్లిచేసుకున్న వధూవరులు.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన పలు వింత వీడియోలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు మరో ప్రత్యేకమైన క్రిస్టియన్ పెళ్లి వార్తల్లో నిలిచింది. ఇందులో వధూవరులు సాహసాన్ని ఆస్వాదిస్తున్నారు. అంతేకాదు.. వారితో సహా చాలా మంది అతిథులు కూడా ఉన్నారు.
కాలంతో పాటు పెళ్లి చేసుకునే విధానంలో అనేక మార్పులు వచ్చాయి. ఇప్పుడు ప్రజలు తమ పెళ్లికి సంబంధించిన కలలను నిజం చేసుకుంటున్నారు. వివాహమనే ప్రత్యేక రోజున ఏదైనా చేయాలనుకోవడానికి ఇదే కారణం. ఇది చిరస్మరణీయంగా మారుతుంది. సాధారణంగా అందమైన, రొమాంటిక్ సెటప్, స్టైలిష్ డ్రెస్, థీమ్ వెన్యూ వంటివి చాలా మంది ఫాలో అవుతుంటారు. ఇదంతా కాకుండా ఓ జంట ఇలా వెరైటీగా ప్లాన్ వేసింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత సాహసోపేతమైన వేడుకను మీరు మునుపెన్నడూ చూసి ఉండరు!
వధూవరులు ఎప్పటికీ మర్చిపోలేని సాహసోపేతమైన వేడుకను ఎంచుకున్నారు. కొందరు వ్యక్తులు ఎత్తైన బండపై నిల్చున్నట్లు వైరల్ అవుతున్న వీడియోలో కనిపించింది. కెమెరా జూమ్ చేయగా, వధూవరులు అతిథులతో సమక్షంలో ఉన్నట్టుగా అర్థమైంది. ఇక్క అక్కడ్నుంచే వారంతా తమ వివాహాన్ని ప్రత్యేకంగా జరుపుకునేందుకు వారు స్కైడైవింగ్ సాహసాన్ని ఎంచుకున్నారు. అందరూ సరదా సాహసాన్ని ఆస్వాదిస్తూ కనిపిస్తారు. ప్రిస్సిల్లా యాంట్, ఫిలిప్పో లెకర్స్ అనే జంట ఇలా కొండ అంచున వివాహం చేసుకున్నట్లు వీడియోకి క్యాప్షన్‌లో రాశారు. కొత్త జీవితం ప్రారంభాన్ని ఇలా అతిథులందరితో థ్రిల్లింగ్ జంప్-ఆఫ్ జరుపుకోవడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇకపోతే, వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరికీ అవసరమైన భద్రతా సామగ్రిని కూడా అమర్చారు.
View this post on Instagram
వైరల్ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో (@lalibretamorada) పంచుకున్నారు. క్యాప్షన్‌లో వ్రాశారు – భయాన్ని మించిన జీవితం ఉందని ఈ ఫ్లైట్ మనకు గుర్తు చేస్తుంది ప్రిస్సిల్లా, ఫిలిప్పోల వివాహం. జూలై 12న షేర్ చేసిన ఈ క్లిప్‌కి ఇప్పటికే 76 వేలకు పైగా వీక్షణలు వచ్చాయి. అదే సమయంలో వినియోగదారులు తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. నేను వీడియోను చూడగానే భయపడ్డాను! కానీ ఏది ఏమైనా అది చాలా బాగుందంటూ మరొకరు కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..