French Daredevil: ఆకాశహర్మ్యం మీద స్టంట్ చేస్తూ 68వ అంతస్తు నుండి పడి మరణించిన వ్యక్తి..
ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో లూసిడి భవనంలో కనిపించినట్లు హాంకాంగ్ అధికారులు తెలిపారు. 40వ అంతస్తులో ఉన్న స్నేహితుడిని కలవడానికి వచ్చానని సెక్యూరిటీ గార్డుకు చెప్పాడు. అయితే గార్డు చెప్పిన స్నేహితుడిని రెమీ గురించి ఎంక్వైరీ చేయగా తనకు అతను తెలియదని చెప్పాడు. అప్పటికే ఆలస్యం అయింది.. లూసిడి ఎలివేటర్‌లోకి ప్రవేశించాడు. CCTV ఫుటేజీలో లూసిడి ట్రెగుంటర్ టవర్ కాంప్లెక్స్ పైకి నిచ్చెన ఎక్కుతున్నట్లు కనిపించింది.
ఆకాశహర్మ్యాలపై విన్యాసాలు చేయడంలో పేరుగాంచిన ఫ్రెంచ్ డేర్‌డెవిల్ రెమీ లూసిడి హాంకాంగ్‌లోని ఎత్తైన భవనంపై నుండి పడి మరణించాడు. స్టంట్ చేయాలనే ఉద్దేశ్యంతో రెమీ లూసిడి భవనంలోకి ప్రవేశించాడని, అయితే పెంట్ హౌస్ లో చిక్కుకుపోయాడని భావిస్తున్నారు. ఈ క్రమంలో కాలు జారి 68వ అంతస్తు నుంచి కిందపడ్డాడు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం 30 ఏళ్ల వ్యక్తి రెమీ లూసిడి స్టంట్‌ను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ట్రాంగుంటర్ టవర్ కాంప్లెక్స్ లోని పెంట్ హౌస్ బయట చిక్కుకున్నాడు. అప్పుడు ప్రాణాపాయం భయంతో రెమీ లూసిడి చేతులతో కిటికీ తలపులు కొట్టడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని లోపల ఉన్న మనిషి చూసి ఆశ్చర్యపడ్డాడు. ఇంతలో లూసిడి తనపై తాను నియంత్రణ కోల్పోయి కింద పడిపోయాడు. ఇది ఆయన అభిమానులకు ఇది చేదువార్తగా మారింది.
ప్రమాదకరమైన విన్యాసాలకు ప్రసిద్ధి చెందిన రెమీ లూసిడి
View this post on Instagram
ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో లూసిడి భవనంలో కనిపించినట్లు హాంకాంగ్ అధికారులు తెలిపారు. 40వ అంతస్తులో ఉన్న స్నేహితుడిని కలవడానికి వచ్చానని సెక్యూరిటీ గార్డుకు చెప్పాడు. అయితే గార్డు చెప్పిన స్నేహితుడిని రెమీ గురించి ఎంక్వైరీ చేయగా తనకు అతను తెలియదని చెప్పాడు. అప్పటికే ఆలస్యం అయింది.. లూసిడి ఎలివేటర్‌లోకి ప్రవేశించాడు.
విన్యాసాల పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
View this post on Instagram
CCTV ఫుటేజీలో లూసిడి ట్రెగుంటర్ టవర్ కాంప్లెక్స్ పైకి నిచ్చెన ఎక్కుతున్నట్లు కనిపించింది. భవనం పైకప్పుకు వెళ్లే తలుపు తెరిచి ఉందని.. అక్కడ ఎవరూ లేరని ప్రజలు చెబుతున్నారు. నివేదికల ప్రకారం, లూసిడి చివరిసారిగా రాత్రి 7.30 గంటలకు పెంట్ హౌస్ కిటికీని తన చేతిని కొట్టడం కనిపించింది. దీంతో పనిమనిషి పోలీసులకు సమాచారం అందించింది.
ప్రస్తుతం ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంఘటన స్థలంలో ఉన్న లూసిడ్ కెమెరాను కనుగొన్నారు. డేర్‌డెవిల్ ఆకాశహర్మ్యాలపై అనేక అద్భుతమైన స్టంట్ వీడియోలు చేయబడ్డాయి.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..