Albino Cobra : భారీ వర్షానికి ప్రత్యక్షమైన అరుదైన పాము.. నేలపై మెల్లగా పాకుతుండగా..

ఇది అల్బినిజం అని పిలువబడే జన్యుపరమైన అసాధారణతతో జన్మిస్తుంది. దీని శరీరం, కళ్ళలో కలర్‌ ఉండదు. ఇది పూర్తిగా తెల్లటి రంగులో ఉండే పాము. విలక్షణమైన నిర్దిష్ట రంగు లేకపోవటం, తెల్లగా కనిపించటం కారణంగా దీనిని శ్వేతనాగు అని పిలుస్తారు. ఇవి రెచ్చగొడితే కాటేసే పాములు కావని, ఆత్మ రక్షణ కోసం అది తన శరీరాన్ని చుట్టేసుకుని తలను దాచుకుంటుందని తెలిపారు. మీకెప్పుడైనా ఇలాంటి పాములు కనిపిస్తే కంగారుపడి చంపేయకుండా.. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు.

Albino Cobra : భారీ వర్షానికి ప్రత్యక్షమైన అరుదైన పాము.. నేలపై మెల్లగా పాకుతుండగా..
Rare White Snake F
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 31, 2023 | 9:53 AM

Albino Cobra : ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా మోసళ్లు, పాములు, ఇతర అడవి జంతువులు ఇళ్లలోకి కొట్టుకువస్తున్నాయి. వరద సమయాల్లో ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. తాజాగా మధ్య హిమాచల్ ప్రదేశ్‌లో అరుదైన తెల్లటి రంగు అల్బినో పాము కనిపించింది. ఆ తెల్లటి శ్వేతనాగు వీడియో ఆన్‌లైన్‌లో షేర్ చేయబడింది. ఆ పాము ఐదు అడుగుల పొడవు కలిగి ఉంది మరియు చంబా జిల్లాలో పొదల మధ్య పాకుతున్నట్లు కనిపించింది. ఇలాంటి అరుదైన, వింత పామును చూసేందుకు జనాలు ఎగబడ్డారు. భయపడుతూనే శ్వేతనాగుతో సెల్ఫీలు దిగేందుకు కూడా ఉత్సుకతను చూపించారు. అది నేలపై మెల్లగా పాకుతూ, ఒక రాయి చుట్టూ చుట్టుకుంది. చివరికి చెట్టు కొమ్మల చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించింది. గతేడాది పూణెలో అల్బినో పాము కనిపించింది.

ఇకపోతే, అల్బినోలు వాటి విలక్షణమైన రూపానికి ప్రసిద్ధి చెందాయి. వాటి అసాధారణ రంగు కారణంగా అవి అరుదైన జాతులుగా గుర్తించబడ్డాయి. ఇలాంటి శ్వేతనాగులు చాలా అరుదుగా కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

అల్బినో స్నేక్ అంటే ఏమిటి?

శ్వేత నాగు.. పాము జాతుల్లో ఇదో రకం. ఇంగ్లీష్ లో అల్బినో కోబ్రా అంటారు. శ్వేత నాగు పేరు చాలా మంది వినే ఉంటారు. కానీ, ప్రత్యక్షంగా చాలా మంది చూసి ఉండరు. ఇదో అరుదైన రకం పాము. మామూలు పాములకన్నా భిన్నంగా ఉంటుంది. దాని చర్మం తెల్లగా మిలమిల మెరిసిపోతూ ఉంటుంది. ఇది అల్బినిజం అని పిలువబడే జన్యుపరమైన అసాధారణతతో జన్మిస్తుంది. దీని శరీరం, కళ్ళలో కలర్‌ ఉండదు. ఇది పూర్తిగా తెల్లటి రంగులో ఉండే పాము. విలక్షణమైన నిర్దిష్ట రంగు లేకపోవటం, తెల్లగా కనిపించటం కారణంగా దీనిని శ్వేతనాగు అని పిలుస్తారు.

ఇటీవల తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో కూడా శ్వేతనాగు హల్‌చల్‌ చేసింది. జిల్లాలోని పర్వతగిరి గ్రామ శివారులో ప్రధాన రహదారిపై శ్వేతనాగు ప్రత్యక్షమైంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ, సడెన్ గా నడిరోడ్డుపై ప్రత్యక్షం అయ్యింది. పామును చూసేందుకు జనాలు భారీగా గుమిగూడటంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

అయితే, ఈ రకం పాములు ఉదయం వేళలో నిద్రించి.. రాత్రి వేళలో తిరుగుతాయని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇవి రెచ్చగొడితే కాటేసే పాములు కావని, ఆత్మ రక్షణ కోసం అది తన శరీరాన్ని చుట్టేసుకుని తలను దాచుకుంటుందని తెలిపారు. మీకెప్పుడైనా ఇలాంటి పాములు కనిపిస్తే కంగారుపడి చంపేయకుండా.. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..