ఏం సెక్యూరిటీ బాస్.. టమాటాల మజాకా.. ముట్టుకుంటే చాలు.. బుస్సు మంటుంది

ఎర్రటి టమాటా పండు ధర కూడా ఎరుపెక్కింది. దీంతో ఇప్పుడు టమాటా దొంగలు కూడా పెరిగిపోతున్నారు. తోటలు, దుకాణాల్లో చొరబడి టమాటా పంటను చోరీ చేస్తున్నారు. ఏపీలో టమాటా రైతు హత్యకు గురవడం కలకలం రేపింది. దీంతో చాలా చోట్ల టమాటా పంటకు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు రైతులు, వ్యాపారులు. అలాంటిదే ఈ వీడియో కూడా..

ఏం సెక్యూరిటీ బాస్.. టమాటాల మజాకా.. ముట్టుకుంటే చాలు.. బుస్సు మంటుంది
Snake Guards Tomatoes
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 15, 2023 | 12:05 PM

రెండు నెలల క్రితం కిలో రూ.20కి లభించే టమాటా ఇప్పుడు రూ.150కి చేరి మామిడిపండ్ల కంటే కూడా ఖరీదైంది. ప్రస్తుతం టమాటా ఏ విలువైన వస్తువు కంటే తక్కువ కాదని నిరూపిస్తుంది. ఎందుకంటే ఎర్రటి టమాటా పండు ధర కూడా ఎరుపెక్కి అధిక ధరలకు అమ్ముడవుతోంది. దీంతో ఇప్పుడు టమాటా దొంగలు కూడా పెరిగిపోతున్నారు. తోటలు, దుకాణాల్లో చొరబడి టమాటా పంటను చోరీ చేస్తున్నారు. ఏపీలో టమాటా రైతు హత్యకు గురవడం కలకలం రేపింది. దీంతో చాలా చోట్ల టమాటా పంటకు సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు రైతులు, వ్యాపారులు. అలాంటిదే ఈ వీడియో కూడా.. టమాటాకు సంబంధించిన ఈ వైరల్‌ వీడియో నెట్టింట సందడి చేస్తుంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో టమాటాలకు కాపలాగా నాగుపాము కూర్చుని ఉంది. వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పడగ విప్పిన నాగుపాము టమాటాలకు కాపు కాస్తున్నట్టుగానే కనిపింది. ఓ వ్యక్తి టమాటాలు తీసుకునే ప్రయత్నం చేయటం కూడా వీడియోలో కనిపిస్తుంది. కానీ, పాము పడగవిప్పి కాటు వేయడానికి ప్రయత్నించింది. ఇక ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. టమాటా ఒక గొప్ప నిధి లాంటిదనని చెప్పారు. అందుకే టమాటాకు కాపలాగా కాలనాగు ఉందని ఫన్నీగా రాసుకొచ్చారు. వీడియో చూసిన షాకింగ్ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో ఓ దుకాణదారుడు మొబైల్ ఫోన్ కొనుగోలుతో పాటు 2 కిలోల టమోటాలను బహుమతిగా అందించే పథకాన్ని ప్రారంభించి వార్తల్లో నిలిచాడు.