AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: చల్‌ చయ్య..చయ్య అంటూ రైల్లో డ్యాన్స్‌ ఇరగీసింది..! ఇలాంటివి బ్యాన్‌ చేయాలంటున్న నెటిజన్లు..

ప్రజా రవాణాలో రీల్స్ తయారీని నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించాలంటూ మరికొందరు నెటిజన్లు సూచిస్తున్నారు. చుట్టు పక్కల ప్రజలు ఇబ్బంది పడతారా..? వారికి అసౌకర్యం కలుగుతుందనే ఆలోచన ఏ మాత్రం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ మరికొందరు మండిపడుతున్నారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Watch: చల్‌ చయ్య..చయ్య అంటూ రైల్లో డ్యాన్స్‌ ఇరగీసింది..! ఇలాంటివి బ్యాన్‌ చేయాలంటున్న నెటిజన్లు..
Reels On Trains
Jyothi Gadda
|

Updated on: Jul 15, 2023 | 12:43 PM

Share

సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇక యువత చేసే రీల్స్ ఇప్పుడు యూట్యూబ్‌లో మరింత ట్రెండ్‌ అవుతున్నాయి. పాపులారిటీ కోసం యువతీ యువకులు చేసే స్టంట్స్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మరింత ఎక్కువ పాపులారిటీ పబ్లిసిటీ కోసం యువతీ, యువకులు ఎలాంటి పనులు చేసేందుకు కూడా వెనుకడుగు వేయటం లేదు. ఇతరులకు అసౌకర్యం కలిగించే అనేక వీడియోలు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం..అలాంటిదే ఈ వీడియో కూడా. కదులుతున్న రైలులో ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న మరో వీడియో వైరల్ అవుతోంది. రైల్లో యువతి చేసిన డ్యాన్స్ నెటిజన్లు బాగా ఆకట్టుకుంటోంది. కానీ, సోషల్ మీడియా ట్రెండ్‌ కోసం రైళ్లలో పెరుగుతున్న ఇలాంటి సంఘటనలపై నెటిజన్లు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కదులుతున్న రైలులో ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ‘taara_celeb’ అనే వినియోగదారు తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. “ట్రైన్ మి సఫర్ ఔర్ యే పాట” అనే శీర్షికతో ఉన్న వీడియో సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్.. చయ్య చయ్య సాంగ్‌. ఆ పాటకు యువతి తన డ్యాన్స్‌తో ప్రతాపం చూపించింది. కానీ, ప్రయాణికులు, నెటిజన్లకు కోపం వచ్చింది మాత్రం ఇదంతా రైల్లో చేసినందుకు. ప్రజల ప్రశాంతత, మనోభావాలను దెబ్బతీసేలా, వారికి ఇబ్బందులు కలిగించేలా ఇలా బహిరంగ ప్రదేశాల్లో రీల్స్‌ చేయటం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Taara_celeb (@taara_celeb)

ప్రజా రవాణాలో రీల్స్ తయారీని నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించాలంటూ మరికొందరు నెటిజన్లు సూచిస్తున్నారు. చుట్టు పక్కల ప్రజలు ఇబ్బంది పడతారా..? వారికి అసౌకర్యం కలుగుతుందనే ఆలోచన ఏ మాత్రం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ మరికొందరు మండిపడుతున్నారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఆ హీరో నన్ను బెదిరించి పాటలు రాయించుకున్నాడు..
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
ఈ సమ్మర్‌లో ట్రెండీ స్మూతీ: సులభంగా తయారు చేసి రోజంతా హైడ్రేట్‌గా
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
సర్వీస్ సెంటర్ చేసిన ఈ పొరపాటుకు కారు యజమానికి రూ.4 లక్షల పరిహారం
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. మంగళూరు స్పెషల్ చికెన్ సుక్కా రెసిపీ
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
మా టార్గెట్ భారతదేశం మాత్రమేః అబ్దుల్ బాసిత్
తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?
తులసి, మనీ ప్లాంట్ ఒకే చోట పెంచవచ్చా?పండితులు ఏం చెబుతున్నారంటే?
రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే
రోడ్ల మీద పర్సులు, నైటీలు అమ్మాను.. కట్ చేస్తే
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
మాంసాహారులు చైత్ర నవరాత్రి ఉపవాసం పాటించవచ్చా? శాస్త్రాలు..
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
రూ.6,337 కోట్ల పన్ను చెల్లించాలని ఎస్‌బీఐకి ఆదాయపు పన్ను నోటీసు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!
కొలెస్ట్రాల్‌తో ప్రాణగండం.. 30 ఏళ్లకే పొంచి ఉన్న గుండె జబ్బులు!