AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నడిరోడ్డుపై మహిళ వింత పూజలు.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె గుబేల్‌..!

అంతలోనే ఆమె ఆ మంట చుట్టూ ఎగురుతూ, దూకుతూ ఏదో వికృతంగా ప్రవర్తించింది. ఆ తరువాత మంటల ముందు కూర్చుని తన జుట్టును విరబోసుకుని మరింత విచిత్రంగా ప్రవర్తించింది. ఇది చూసి చాలా మంది తొలుత భయపడినా, ఆ తరువాత ఒక్కొక్కరుగా అక్కడ్నుంచి బయలుదేరడం ప్రారంభించాడు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..

Viral Video: నడిరోడ్డుపై మహిళ వింత పూజలు.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె గుబేల్‌..!
Woman Performs Rituals
Jyothi Gadda
|

Updated on: Jul 22, 2024 | 4:15 PM

Share

సోషల్‌ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో నడిరోడ్డుపై కూర్చొని ఓ మహిళ చేసిన వికృత చేష్టలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. వచ్చే పోయే వాహనాలతో రద్దీగా ఉన్న రోడ్డుపై ఒక మహిళ విచిత్ర పూజలు చేస్తూ, వింతగా ప్రవర్తించింది. సదరు మహిళ చేస్తున్న చర్యలను చూసిన అక్కడి ప్రజలు తమ వాహనాలు ఎక్కడికక్కడే ఆపేసి నిలబడిపోయారు. ఈ మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్గమధ్యలో ఆమె ఇదంతా ఎందుకు చేస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో చోటు చేసుకుంది. నడి రోడ్డు మధ్యలో ట్రాఫిక్‌ను ఆపేసిన మహిళ క్షుద్రపూజలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ విషయంపై ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వైరల్‌ వీడియోలో మహిళ రోడ్డు మధ్యలో వాటర్ బాటిల్, ఆయిల్, బ్యాగ్ తీసుకుని కూర్చుంది. ఆ తరువాత అక్కడ మంటలు కూడా కనిపిస్తున్నాయి. మొదట్లో కొంత మంది ఆ మహిళను దాటకుంటూ వెళ్లిపోతున్నారు. అంతలో ఆమె లేచి నిలబడి వింతగా వాహనదారులను చూడటం మొదలుపెట్టింది. దాంతో భయపడిపోయిన వారంతా ఎక్కడిక్కడే ఆగిపోయారు. అంతలోనే ఆమె ఆ మంట చుట్టూ ఎగురుతూ, దూకుతూ ఏదో వికృతంగా ప్రవర్తించింది. ఆ తరువాత మంటల ముందు కూర్చుని తన జుట్టును విరబోసుకుని మరింత విచిత్రంగా ప్రవర్తించింది. ఇది చూసి చాలా మంది తొలుత భయపడినా, ఆ తరువాత ఒక్కొక్కరుగా అక్కడ్నుంచి బయలుదేరడం ప్రారంభించాడు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..

ఇవి కూడా చదవండి

నడిరోడ్డుపై విచిత్ర పూజలు చేసిన సదరు మహిళ మానసిక పరిస్థితి సరిగా లేదని ఆ తరువాత తెలిసింది. అందువల్లే ఆమె నడిరోడ్డుపై కూర్చుని ఇలా పూజలు చేస్తుండగా, అందరూ ఆమె మంత్రాలు చేస్తుందని భయపడ్డారు. ఆమె వింత ప్రవర్తన చూసిన కొందరు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. దాంతో ఆమె వింతగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఏది స్పష్టంగా లేదు. వీడియో వైరల్‌గా మారటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెను వెతకడానికి ఆమె ఇంటికి చేరుకున్నారు. పోలీసుల విచారణలో ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని భర్త చెప్పాడు. కొన్నిసార్లు ఆమె ఇలాంటి వింత పనులు చేస్తుందని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సంక్రాంతి సెలవుల తర్వాత ఉత్సాహంగా బడికి వచ్చారు.. కానీ..
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
సిరీస్ కోల్పోయిన గిల్ సేన.. కెప్టెన్ మళ్ళీ అదే పాత పాట
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
ఈ మద్యం ధర కేవలం 180 రూపాయలే.. కానీ అమ్మకాల్లో రికార్డ్‌..!
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!