తొక్కే కదా అని తేలిగ్గా తీసుకోకండి.. ఖరీదైన ఈ పండ్ల తొక్కలతో ఎన్నో రోగాలకు చెక్‌ పెటొచ్చు..!

పండ్లను తింటాం కానీ, వాటి తొక్కలను తీసి పడవేస్తుంటా..కానీ, అలా చేయటం తప్పంటున్నారు పోషకాహార నిపుణులు. నిజానికి కొన్ని రకాల పండ్ల తొక్కలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

తొక్కే కదా అని తేలిగ్గా తీసుకోకండి.. ఖరీదైన ఈ పండ్ల తొక్కలతో ఎన్నో రోగాలకు చెక్‌ పెటొచ్చు..!
Fruits
Follow us

|

Updated on: Jul 22, 2024 | 2:59 PM

పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నది మనందరికీ తెలిసిందే. క్రమం తప్పకుండా మనం తినే ఆహారంలో పండ్లను చేర్చుకోవటం వల్ల ఎన్నో రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే, దాదాపుగా మనందరం పండ్లను తింటాం కానీ, వాటి తొక్కలను తీసి పడవేస్తుంటా..కానీ, అలా చేయటం తప్పంటున్నారు పోషకాహార నిపుణులు. నిజానికి కొన్ని రకాల పండ్ల తొక్కలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

కివి పండు:

కాస్త ఖరీదైనదే.. కానీ, దీని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం పుష్కలం.. ముఖ్యంగా కివి పండును డెంగ్యూ బాధితుల్లో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడానికి తప్పక తీసుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. కానీ, కివి పండు తొక్క.. గరుకుగా, దృఢంగా ఉంటుంది. అందుకే ఎవరూ తినేందుకు ఇష్టపడరు.. కానీ, కివి పండు తొక్కలో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ C పొందవచ్చు. నిజానికి, దాని పైతొక్క.. గుజ్జు కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

డ్రాగన్ ఫ్రూట్:

ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన డ్రాగన్‌ ఫ్రూట్‌ను మనం తొక్కను తీసేసే తింటాం… కానీ, డ్రాగన్‌ ఫ్రూట్‌ తొక్క కూడా చాలా ఆరోగ్యకరమైనదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ తొక్కలో ఎక్కువ మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, బీటాసైనిన్ లు ఉన్నాయి. ఇందులో మంచి మొత్తంలో ఆంథోసైనిన్లను కూడా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడుతాయి. డ్రాగన్‌ ఫ్రూట్‌ తొక్కలో ఉండే డైటరీ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కూడా తగ్గిస్తుంది.

పియర్:

ఈ పండును తింటుంటే..ఆపిల్ పండు తింటున్న అనుభూతి కలుగుతుంది. చాలా రుచిగా కూడా ఉంటుంది. కొలెస్ట్రాల్, మలబద్ధకం, మధుమేహం అలాగే క్యాన్సర్‌ను కూడా దూరంగా ఉంచుతుంది. పియర్‌ పండు తొక్కలో ఎన్నో పోషకాలు, ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ లు ఉంటాయి. ఇది ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పియర్ పండు పీల్స్‌లో ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది మిమ్మల్ని అతిగా తినకుండా చేస్తుంది.

జామపండు:

జామకాయను.. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే చవకైన పండు.. దీన్ని సాధారణంగా తొక్కతోనే తింటుంటారు. జామపండు తొక్కతో కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది మన చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది..అంతేకాదు. చర్మం, జుట్టుకు ఎన్నో పోషకాలను అందిస్తుంది. జామ తొక్క సారం మన చర్మాన్ని అందంగా, ప్రకాశవంతంగా చేస్తుంది. అలాగే చర్మంపై మచ్చలను పోగొడుతుంది. మొటిమలను కూడా నివారిస్తుంది.

ఆపిల్ పండు:

మనంలో చాలా మంది ఆపిల్ పండును కూడా తొక్క తీసేసి తింటుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మీరు ఎన్నో పోషకాలను కోల్పోతారు. ఆపిల్ తొక్కలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె సమృద్ధిగా ఉంటాయి. దీనిలో పొటాషియం, భాస్వరం, కాల్షియం కూడా ఉంటాయి. ఇవి మన మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

తొక్కే కదా అని తేలిగ్గా తీసుకోకండి.. ఖరీదైన ఈ పండ్ల తొక్కలతో ..
తొక్కే కదా అని తేలిగ్గా తీసుకోకండి.. ఖరీదైన ఈ పండ్ల తొక్కలతో ..
సెక్షన్ 80సీ ఒక్కటే కాదు.. అంతకు మించి పన్ను ఆదా చేసే విధానాలు..
సెక్షన్ 80సీ ఒక్కటే కాదు.. అంతకు మించి పన్ను ఆదా చేసే విధానాలు..
పేద విద్యార్థినికి సితార ఆర్థిక సాయం..మెడిసిన్ కు అయ్యే ఖర్చంతా..
పేద విద్యార్థినికి సితార ఆర్థిక సాయం..మెడిసిన్ కు అయ్యే ఖర్చంతా..
మగవారి కంటే ఎక్కువ ఒత్తిడికి గురవుతున్న మహిళలు..
మగవారి కంటే ఎక్కువ ఒత్తిడికి గురవుతున్న మహిళలు..
వర్షాకాలంలో ఈ తప్పులు చేస్తున్నారా.? మీ స్మార్ట్‌ టీవీ డేంజర్‌లో
వర్షాకాలంలో ఈ తప్పులు చేస్తున్నారా.? మీ స్మార్ట్‌ టీవీ డేంజర్‌లో
ప్రభాస్ సినిమా కోసం పాకిస్థాన్ హీరోయిన్‌ను దింపుతున్నారా.?
ప్రభాస్ సినిమా కోసం పాకిస్థాన్ హీరోయిన్‌ను దింపుతున్నారా.?
మన దేశంలో జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్రదేశాలు.. ఏమిటంటే
మన దేశంలో జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్రదేశాలు.. ఏమిటంటే
దేశంలో పెరిగిన ఊబకాయం.. అధిక బరువు సమస్య. కారణం అదేనా?
దేశంలో పెరిగిన ఊబకాయం.. అధిక బరువు సమస్య. కారణం అదేనా?
రైలు టికెట్ల రీఫండ్ పేరు కొత్త స్కామ్.. సాయం చేస్తామంటూనే..
రైలు టికెట్ల రీఫండ్ పేరు కొత్త స్కామ్.. సాయం చేస్తామంటూనే..
ఇలాంటి ఫుడ్స్‌ తింటే..మీరు కనీసం పదేళ్లు తక్కువగా కనిపించడం ఖాయం!
ఇలాంటి ఫుడ్స్‌ తింటే..మీరు కనీసం పదేళ్లు తక్కువగా కనిపించడం ఖాయం!